కాలిఫోర్నియాలో మహానేతకు ఘన నివాళి

8 Sep, 2020 15:27 IST|Sakshi

కాలిఫోర్నియా : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 11వ వర్ధంతిని పురష్కరించుకుని  కాలిఫోర్నియా బే ఏరియాలో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సెప్టెంబర్  5వ తేదీ  ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైస్సార్‌సీపీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కెవి రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కెవిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ మరణం లేని నేత అని, ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ ప‌థకాల‌ను ప్రవేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్రతి పేద‌వాడికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.  ఆరోగ్య శ్రీ , 108, 104  లాంటి అనేక కార్యక్రమాలు, నేటి కరోనా లాంటి  క్లిష్ట కాలంలో ప్రజలును ఆదుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ముఖ్య సభ్యులైన  సుబ్రహ్మణ్యం రెడ్డివారి, హరి శీలం, కిరణ్ కూచిభట్ల, కృష్ణారెడ్డి, అంకిరెడ్డి, బే ఏరియా వైఎస్సార్ అభిమానులు, ఇతర స్టూడెంట్ విభాగం నాయకులూ పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు