వర్జీనియాలో డెమెక్రాటిక్‌ పార్టీనే గెలిపించండి

5 Oct, 2021 14:03 IST|Sakshi

నవంబరు 2న జరిగే ఎన్నికల్లో వర్జీనియా గవర్నర్‌గా టెర్రీని గెలిపించాలని వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు కోరారు. అమెరికా అధ్యక్షులు జోసఫ్ బైడన్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేసారు. ఇమిగ్రేషన్, బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలను వక్తలు వివరంగా తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న అనుకూల విధానాలే కొనసాగాలంటే  డెమోక్రాట్లు అధికారంలోకి రావాలని తెలిపారు. వాషింగ్టన్ డీసీ డెమోక్రాటిక్ పార్టీ నాయకులు శ్రీధర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో లౌడెన్ కౌంటీ, వర్జీనియా రాష్ట్రంలోని లౌడెన్‌ కౌంటీలో  ప్రవాస భారతీయ నాయకులు తొలిసారిగా సభ నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హాహాఫ్ ముఖ్య అతిథి గా విచ్చేశారు.

గత వర్జీనియా గవర్నర్, ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్న టెర్రీ మెకాలిఫ్, అటార్నీ జనరల్ గా పోటీ చేస్తున్న మార్క్ హేరింగ్, అమెరికా రిప్రజెంటేటివ్ జెన్నిఫర్ వెక్సన్, వర్జీనియా సెనేటర్ జెన్నిఫర్ బాయిస్కో, డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, డెలిగేట్ వెండీ గూడిటిస్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతు కోరారు. ఈ సమావేశంలో ప్రవాస తెలుగు, భారతీయ జాతీయ, ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు భాగమయ్యారు. 

ప్రసంగించిన వక్తలు వర్జీనియా రాష్ట్రంలో, డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ రంగాలలో  జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, హై టెక్నాలజీ, ఎంప్లాయిమెంట్, కోవిడ్ వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు.

 
 

>
మరిన్ని వార్తలు