అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా

8 Dec, 2023 21:56 IST|Sakshi

అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు.

యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌కు ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన అమిత్‌ పటేల్‌ ఆ టీమ్‌కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో  జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖ‌రీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే  చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్‌తో కలసి విహార యాత్రలు చేసేవాడు. 

ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావడంతో జాక్సన్‌విల్లే యాజమాన్యం అమిత్‌ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్ట్ ‌లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.

>
మరిన్ని వార్తలు