ఫిన్‌లాండ్‌ తెలుగు అసోషియేషన్‌ ఉగాది పండగ శుభాకాంక్షలు

17 Apr, 2021 20:10 IST|Sakshi

హెల్సింకి: ఫిన్‌లాండ్‌ దేశంలో ‘ఫిన్‌లాండ్‌ తెలుగు అసోషియేషన్‌’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్‌లాండ్‌ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్‌ పర్లపల్లి ఫిన్‌లాండ్‌ తెలుగు అసోషియేషన్‌(ఎఫ్‌ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్‌లాండ్‌లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్‌ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.

చదవండి: ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
 

మరిన్ని వార్తలు