టెక్సాస్‌: గప్‌చుప్‌గా చొరబడి.. ఆలయంలో హుండీ, లాకర్‌ ఎత్తుకెళ్లారు

20 Jan, 2023 20:33 IST|Sakshi

ఆస్టిన్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లో​ని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు.  ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది. 

బ్రజోస్‌ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్‌ ఆలయం. ఈ ఆలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డ్‌ మెంబర్‌ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కిటికీ తొలగించి లోనికి చొరబడ్డ ఆంగతకులు.. హుండీతో పాటు కొన్ని విలువైన వస్తువులున్న లాకర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. అయితే ఆలయ అర్చుకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తోందని, వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సుంకరి వెల్లడించారు.

ఇక.. సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నమోదు అయ్యింది. ఆదివారం హిందూ కమ్యూనిటీతో సమావేశమై.. ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు. అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు