ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్  నూతన బోర్డు ఎంపిక

13 Jan, 2023 15:38 IST|Sakshi

ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ 2023 సంవత్సరానికి గాను కొత్త బోర్డు కొలువుదీరింది.  ఎన్నికైన నూతన  బోర్డు కార్యవర‍్గం, ఇతర సభ్యుల చేత  పద్మశ్రీ సంత్ సింగ్ వీరమణి  ప్రమాణ స్వీకారం  చేయించారని ఐఏఎన్‌టీ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త బోర్డు అధ్యక్ష కార్యదర్శులు
అధ్యక్షుడు- దినేష్ హుడా
మాజీ అధ్యక్షుడు- ఉర్మీత్ జునేజా  
సుష్మా మల్హోత్రా - ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ 
కార్యదర్శి - జస్టిన్ వర్గీస్
కోశాధికారి- పద్మ మిశ్రా
జాయింట్‌ కోశాధికారి- నవాజ్ ఝా 

డైరెక్టర్స్‌: శ్రేయాన్స్ జైన్,  స్మరణిక రౌత్ , హేతల్ షా,  వైభవ్ శేత్,  మనీష్ చోక్షి , సుభాశిష్ నాయక్ , దీపక్ కల్రా, వెంకట్ ములుకుట్ల

ట్రస్టీలు
ఇందు రెడ్డి మందడి (ట్రస్టీ చైర్)
కమల్ కౌశల్ (ట్రస్టీ కో-చైర్)
సల్మాన్ ఫర్షోరి (తక్షణ గత కుర్చీ)
స్వాతి షా
శైలేష్ షా
అక్రమ్ సయ్యద్
జాక్ గోధ్వాని

ట్రస్టీ ఎమెరిటస్: షబ్నం మోద్గిల్, లాల్ దాస్వానీ, సుధీర్ పారిఖ్

తమ బోర్డ్ సభ్యులు 6 దశాబ్దాలకు పైగా భారతీయ సమాజానికి గొప్ప అభిరుచితో సేవలందిస్తున్నారని పేర్కొన్న  పద్మశ్రీ సంత్ సింగ్ విర్మణి  కొత్త బోర్డు సభ్యులందరికీ  శుభాకాంక్షలు  అందించారు. IANTని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు దినేష్ హుడా,  BOT చైర్ ఇందు రెడ్డి మందాడి  వెల్లడించారు.

1962లో స్థాపించిన ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్‌టీ) ఉత్తర టెక్సాస్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన రాజకీయేతర, సెక్టారియన్ సంస్థ అని,  1976లో విలీనమైందని ఐఏఎన్‌టీ వెల్లడించింది. సాంస్కృతిక విద్యా అవసరాలను తీర్చడమే ప్రాథమిక ఉద్దేశమని సంస్థ ప్రకటించింది.   IANT అనేది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ద్వారా DFW ఏరియాలో ఆమోదించబడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) గొడుగు సంస్థ అని పేర్కొన్నారు.  గత 60 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో వివిధ కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా భారతీయ సంతతికి చెందిన విశిష్ట వ్యక్తులు భారతీయ సమాజానికి సేవ సేవలందించారని ఐఏఎన్‌టీ పేర్కొంది.

మరిన్ని వార్తలు