నాట్స్‌ ప్రెసిడెంట్‌గా విజయ్ శేఖర్ అన్నే

30 Jul, 2020 13:37 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో తెలుగువారికి అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) 2020-2022కు కొత్త కార్య నిర్వాహ‌క కమిటీని ప్రకటించింది. నాట్స్ ప్రెసిడెంట్‌గా విజయ్ శేఖర్ అన్నేకు పదవీ బాధ్యతలు కట్టబెట్టింది. డాలస్‌కు చెందిన బాపయ్య చౌదరి నూతి, న్యూజెర్సీకి చెందిన వంశీకృష్ణ వెనిగళ్ల, మిస్సోరికి చెందిన రమేశ్ బెల్లం, ప్లోరిడాకు చెందిన శ్రీనివాస్ మల్లాది వైస్ ప్రెసిడెంట్స్‌గా సేవలు అందించనున్నారు. సెక్రటరీగా రంజిత్ చాగంటి, ట్రెజరర్‌గా మదన్ పాములపాటి, జాయింట్ సెక్రటరీగా జ్యోతి వనం, జాయింట్ ట్రెజరర్‌గా హేమంత్ కొల్ల బాధ్యతలు తీసుకున్నారు.

హెల్ప్ లైన్ ఫండ్ రైజింగ్ రామ్ నరేశ్ కొమ్మనబోయిన, ఇండియా లైజన్ శ్రీని గొంది, మార్కెటింగ్ రవి గుమ్మడిపూడి, మెంబర్ షిప్ అశోక్ కుమార్ గుత్తా, స్పోర్ట్స్ చంద్రశేఖర్ కొణిదెల, మీడియా రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా శ్రీనివాస్ కాకుమాను, వుమెన్ ఎంపవర్‌మెంట్ జయశ్రీ పెద్దిబొట్ల, ప్రోగ్రామ్స్ లక్ష్మీబొజ్జ.. వీరంతా తమకు అప్పగించిన బాధ్యతల్లో నేషనల్ కో-ఆర్డినేటర్లుగా కొనసాగనున్నారు. కిరణ్ కొత్తపల్లి, కిరణ్ యార్లగడ్డ, రాజేశ్ కాండ్రు, భాను లంక, కృష్ణ నిమ్మగడ్డ, కోటేశ్వరరావు బోడెపూడి, రామ్ కొడితల.. ఈ ఏడుగురు జోనల్ వైస్ ప్రెసిడెంట్లుగా ఈ రెండేళ్లు పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు. నాట్స్ ప్రధానంగా చేపట్టే కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో కూడా సమన్వయకర్తలను నియమించింది. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ(వెబ్) సుధీర్ కుమార్ మిక్కిలినేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా రిలేషన్స్) మురళీ కృష్ణ మేడిచర్లలు తమ సేవలు అందించనున్నారు. 

ఇదే సమయంలో నాట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హెల్ప్ లైన్ టీం 1-888-4-TELUGU (1-888-483-5848) కు అదనంగా తీసుకున్న సతీష్ ముమ్మనగండి, జాతీయ హెల్ప్ లైన్ టీం మెంబర్( గృహ హింస) కవిత దొడ్డాలు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించనున్నారు. ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్న (2020-2022) రెండేళ్ల కాలపరిమితికి నూతన కార్యనిర్వాహక సభ్యులకు తన అభినందనలు తెలుపుతూ, నాట్స్ నూతన అధ్యక్షుడిగా తెలుగు ప్రజలకు మరింత విశిష్టమైన సేవలను అందించడమే లక్ష్యంగా నాట్స్‌ను మరింత సంఘటితం చేస్తానని అన్నే శేఖర్ పేర్కొన్నారు. (డల్లాస్‌లో నిరాశ్రయులకు నాట్స్‌ ఆహార పంపిణీ)

నూతన కార్యవర్గానికి అభినందనలు
నూతన కార్య నిర్వాహక కమిటీకి నాట్స్ ఛైర్మన్ శ్రీధ‌ర్ అప్పసాని అభినందనలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం నాట్స్ ఉన్నతిని మరింతగా పెంచుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు నాట్స్ ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని కార్యవర్గ సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2018-2020లో నాట్స్‌ను ప్రగతి పథంలో నడిపించినందుకు శ్రీనివాస్ మంచికలపూడి, తన కార్యవర్గ సభ్యులను శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు. గత రెండేళ్లలో శ్రీనివాస్ మంచికలపూడి నాయకత్వంలో నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తన ప్రతిష్టను ఇనుమడింపచేసిందని, అదే బాటలో కొత్త నాయకత్వం కూడా పనిచేస్తుందని నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని ఆశాభావం వ్యక్త పరిచారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు