చంద్రమోహన్‌కు ఎన్నారైల ఘన నివాళులు

4 Dec, 2023 16:29 IST|Sakshi

ప్రముఖ నటుడు,ఇటీవలె స్వర్గస్తులైన చంద్రమోహన్‌కి ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. వంశీ ఇంటర్నేషనల్‌, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాల మాధ్యమంగా శనివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, చంద్రమోహన్‌ కుటుంబసభ్యులు, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రమోహన్‌తో 21 సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు,చంద్రమోహన్‌ మేనల్లుడు, ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌, కళాతపస్వి కె. విశ్వనాథ్  తనయుడు కాశీనాధుని నాగేంద్ర సహా పలువురు చంద్రమోహన్‌తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వీరితో పాటు అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, హైదరాబాదు నుంచి హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి,కువైట్ నుండి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుండి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొని చంద్రమోహన్‌కు ఘన నివాళులు అర్పించారు. 


 

>
మరిన్ని వార్తలు