ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి పెళ్లి

6 Nov, 2023 10:53 IST|Sakshi

నందిగామ: నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల గ్రామానికి చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైంది. ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు.

వీరు అక్టోబర్‌ 29న నందిగామ సమీపంలోని పల్లగిరిగుట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గణేష్‌ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. డీవీఆర్‌ కాలనీలోని గణేష్‌, దీపును పోలీసులు పిలిపించారు.

తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్‌ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వెళ్లిపోయారు. గణేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓ మనిషిని ట్రాన్స్‌జెండర్‌ ఇష్టపడితే జీవితాంతం ప్రేమను అందిస్తుందన్నాడు. దీపు మాట్లాడుతూ.. ఒకరి కోసం ఒకరం జీవిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తలు