అమిత్‌ షా పర్యటనలో మార్పు.. 18న రాక

15 Nov, 2023 04:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రావ లసి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ ఒకరోజు వాయిదా పడ్డాయి.

ఈనెల 18న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో జరిగే బహిరంగ సభల్లో షా పాల్గొంటారు.

మరిన్ని వార్తలు