నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన 

24 Nov, 2023 03:56 IST|Sakshi

శుక్రవారం వివిధ సభలు, రోడ్‌షోలలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌సింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో మరోసారి సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూర్‌లో సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో షా ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్, 3 గంటలకు శేరి లింగంపల్లి, సాయంత్రం 4.30 గంటలకు అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో ఆయన రోడ్‌ షో నిర్వహించనున్నారు.

25న ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షోలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటకు ములుగు, మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి, సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్‌ నియోజకవర్గాల పరిధిలో జరగనున్న బహిరంగ సభలలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు