ప్రధాని మోదీకి సచిన్‌ పైలట్‌ కౌంటర్‌: ట్రెండ్‌ రివర్స్‌!

23 Nov, 2023 18:40 IST|Sakshi

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పర్వం  కీలక దశకు చేరుకుంది.  గురువారం సాయంత్రం  6 గంటలతో ప్రచార పర్వానికి తెర పడింది.  200 నియోజకవర్గాలకు పోలింగ్ నవంబర్ 25న జరగనుంది. డిసెంబరు 3న  ఫలితాల ప్రకటనతో అధికార పీఠం ఎవరికి దక్కనుందనే దానిపై క్లారిటీవస్తుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

రాజస్థాన్  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి కౌంటర్‌ఇచ్చారు.  కాంగ్రెస్‌లో పైలట్‌కు గౌరవం లేదంటూ  ప్రధానిచేసిన  వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ముందు తన పార్టీని సంగతి  చూసుకోవాలంటూ మోదీకి స్ట్రాంగ్‌  కౌంటర్‌ ఇచ్చారు. తనకు  పార్టీలో వివిధ హోదాల్లో గౌరవం లభించిందనీ, పీసీసీ చీఫ్‌, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ప్రతి పదవులను గుర్తు చేశారు. అలాగే  తన భవిష్యత్తు, శ్రేయస్సును అంతా కాంగ్రెస్‌  పార్టీనే  చూసుకుంటుందన్నారు. ఇందిరా గాంధీ ప్రేరణతోనే తన తండ్రి  కాంగ్రెస్‌లో చేరారనీ, ఆయనకు పార్టీ సముచిత స్థానం లభించిందని తెలిపారు.  కాంగ్రెస్‌తో  చాలా సంతోషంగా  ఉన్నామన్నారు.

ట్రెండ్‌ రివర్స్‌
మరోవైపు ప్రజలు ట్రెండ్ మార్చాలని కోరుకుంటున్నారు...మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే గెలిపిస్తారు. బీజేపీ 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తోంది.  తమ కార్యకర్తలు కూడా ఈసారి మరింత ఉత్సాహంగా ఉన్నారు.   పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టో  ఆధారంగా మెజారిటీ సాధిస్తామని సచిన్‌ పైలట్‌ ధీమా వ్యక్తం చేశారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్‌లో పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. నిజాలు మాట్లాడినందుకు  గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించి నందుకు దివంగత రాజేష్ పైలట్‌ను శిక్షించారు  ఇపుడు ఆయన  కుమారుడిని కూడా శిక్షిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. పార్టీ ప్రయోజనాల నిమిత్తం కుటుంబ పాలనను వ్యతిరేంచినందుకు ఆయన కుమారుడు సచిన్ పైలట్ ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. రాజస్థాన్‌లో  సీఎం అశోక్ గెహ్లాట్  ప్రభుత్వం ఎప్పటికీ ఏర్పాటు రాదు అని మోదీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు