Rajasthan Elections 2023: ‘ప్రజలు మార్చేసే మూడ్‌లో ఉన్నారు’

23 Nov, 2023 18:28 IST|Sakshi

చిత్తోర్‌గఢ్ (రాజస్థాన్): రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన గురువారం  కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్తోర్‌గఢ్, నాథ్‌ద్వారా నియోజకవర్గాల్లో మెగా రోడ్‌షోలు  నిర్వహించారు. రెండు చోట్లా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. 

అంతకుముందు జైపూర్‌లో విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఆరు నెలల్లో రాష్ట్రమంతటా పర్యటించానని, ప్రజల్లో మార్పు మూడ్‌ ఉందని, రాజస్థాన్‌లో తదుపరి ప్రభుత్వం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రణాళికాబద్ధమైన వ్యూహాలతో జరిగాయని ఆరోపించారు. 'ఓటు బ్యాంకు' రాజకీయాల కారణంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎటువంటి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు