AP Political News Dec 17th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

17 Dec, 2023 21:49 IST|Sakshi

AP Elections Political Latest Updates Telugu

9:28PM, Dec 17th, 2023

తెలుగుదేశం-జనసేన మధ్య తేడా కొడుతున్న సంబంధాలు

  • లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రానని చెప్పేసిన పవన్ కళ్యాణ్
  • సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేదాభిప్రాయాలు
  • పరిస్థితిలో తేడా రావడంతో రంగంలోకి దిగిన చంద్రబాబు
  • మాదాపూర్ లోని  పవన్ కల్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు 
  • తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చ జరుపుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్
  • సీట్ల పంపకంపై పవన్, చంద్రబాబు చర్చలు
  • సీట్లను సర్దుబాటు చేస్తాం కానీ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రావాలని పవన్ కళ్యాణ్ ను అడిగిన చంద్రబాబు
  • 50 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ టికెట్లు అడుగుతున్న పవన్ కళ్యాణ్
  • 30 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ టికెట్ల దగ్గర ఆగిన చంద్రబాబు

07:01PM, Dec17th, 2023

ప్రతీ పేదవాడి సామాజిక యాత్ర ఇది:  ఎమ్మెల్యేమొండితోక జగన్మోహనరావు

  • పాలనను ప్రజల వద్దకే తెచ్చిన ప్రభుత్వమిది
  • వాలంటీర్లను విమర్శించిన నోళ్లే 25 ఇళ్లకు ఒకరిని పెడతామంటున్నారు 
  • అమ్మఒడి దండగ అన్న వాళ్లే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ ఇస్తామంటున్నారు 
  • డబ్బంతా పప్పూ బెల్లాల్లా పంచేస్తున్నారు...మరో శ్రీలంక చేసేస్తున్నారన్నారు 
  • ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పథకాలనే మేమూ చెస్తామంటున్నారు 
  • రుణమాఫీ చేస్తామని రైతులను బాధపెట్టిన సైకో చంద్రబాబు 
  • డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన సైకో చంద్రబాబు
  • దొంగే దొంగ అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు 
  • ఈ నాలుగేళ్లలో నందిగామ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది 
  • నన్ను,నా సోదరుడిని నాయకుడిగా నిలబెట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నా

07:00PM, Dec17th, 2023

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బీసీలకు ఏం చేశాడు?: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

  • సామాజిక సాధికారత నినాదం కాదు ఒక విధానమని చేసి చూపిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
  • పూర్తిస్థాయిలో సామాజిక సాధికారత చేసి చూపిన నేత జగన్‌మోహన్‌రెడ్డి
  • చంద్రబాబు బిసి,ఎస్సీ,ఎస్టీలను అణగదొక్కాడు 
  • క్యాబినెట్ లో 19 మందికి అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చరిత్ర 
  • చంద్రబాబు హయాంలో ఒక్కరంటే ఒక్కరు మైనార్టీ మంత్రి లేరు 
  • 12 మంది మైనార్టీలకు రాష్ట్రస్థాయి పదవులిచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది 
  • ప్రతీ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% శాతం అవకాశం కల్పించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
  • నందిగామ ఏఎంసీ ఛైర్మన్ పదవి మైనార్టీ మహిళకు ఇచ్చారు 
  • జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉంది 
  • జగన్ ను ఢీకొట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు ఏకమౌతున్నాయి 
  • ఎంతమంది ఏకమై వచ్చినా సింహంలాంటి జగన్ మోహన్ రెడ్డిని ఎవరూ ఆపలేరు 
  • మీకు మేలు జరిగితేనే ఓటేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • చంద్రబాబుకు జగన్‌మోహన్‌రెడ్డిలా చెప్పే దమ్ముందా 
  • వయసైపోయింది...ఒక్క ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు అడుగుతున్నాడు 
  • 75 ఏళ్లు వచ్చిన చంద్రబాబు ఎవరి భవిష్యత్తుకు గ్యారంటీ 
  • చంద్రబాబు నిన్ను నమ్మంకాక నమ్మం 
  • మన నినాదం 175 కి 175 
  • కచ్చితంగా ఆ దిశగా మనం పనిచేయాలి

06:54PM, Dec17th, 2023

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాజిక న్యాయం జరిగింది సీఎం జగన్‌ హయాంలోనే : మంత్రి జోగిరమేష్

  • దేశంలో మరే ముఖ్యమంత్రి జగన్‌లా పాలన చేయలేదు
  • జగన్‌మోహన్‌రెడ్డి మాదిరి ఏనాడైనా సామాజిక ధర్మాన్ని పాటించావా చంద్రబాబు 
  • జగన్ మోహన్ రెడ్డి నలుగురు బిసిలను రాజ్యసభకు పంపించారు  
  • వర్ల రామయ్యకు రాజ్యసభ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు 
  • దమ్మున్న మొనగాడు...ధీశాలి జగన్ మోహన్ రెడ్డి 
  • చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మళ్లీ సీఎం అయ్యేది  జగన్ మోహన్ రెడ్డే
  • చంద్రబాబు,పవన్ అంతా కట్టకట్టుకుని వచ్చినా కృష్ణానదిలో కలిపేస్తాం
  • రాబోయే ఎన్నికల్లో పేదవాడికి పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతోంది 
  • పేదవాడికి అండగా నిలిచిన జగన్‌మోహన్‌రెడ్డికి మనమంతా అండగా  నిలవాలి

06:50PM. Dec17th, 2023

ఏ ఒక్క పోరాటం చేయకుండానే ఏపీలో సామాజిక విప్లవం: మంత్రి మేరుగ

  • దేశంలో సామాజిక విప్లవం కోసం ఎంతో మంది మహానుభానుభావులు పోరాడారు 
  • ఏ ఒక్క పోరాటం చేయకుండానే ఏపీలో సామాజిక విప్లవం వచ్చింది 
  • గత పాలకులు ఎస్సీలను చులకనగా చూశారు 
  • చంద్రబాబు చేసిన అవమానాన్ని బిసి,ఎస్సీలు మర్చిపోకూడదు
  • జడ్జిలుగా బిసిలు పనిచేయరని చంద్రబాబు లేఖరాశాడు 
  • జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే బిసి, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు న్యాయం జరిగింది 
  • బిసి,ఎస్సీ,ఎస్టీలను మింగేసిన గజదొంగ చంద్రబాబు 
  • మన హక్కులను కాలరాసిన వ్యక్తి చంద్రబాబు 
  • బర్రెలక్క కన్నా పవన్ కళ్యాణ్ హీనం 
  • ఉట్టికెక్కలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుంది పవన్ తీరు 
  • చంద్రబాబును ఓడించాల్సిన బాధ్యత మన పై ఉంది 
  • చంద్రబాబు పుట్టిందెక్కడ...పోటీచేసిందెక్కడ 
  • లోకేష్ ఎక్కడపుట్టాడు...ఎక్కడ పోటీచేశాడు 
  • మనమంతా కలిసి జగనన్నను కాపాడుకోవాలి
  • మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డిన్ సీఎంగా చేసుకోవాలి

05:26PM, Dec17th, 2023

మహిళా సాధికారితకు పెద్ద పీట వేశారు సీఎం జగన్‌: మంత్రి వేణుగోపాలకృష్ణ

  • సీఎం జగన్‌ ఒక సంస్కర్త... ఆయనకు సలాం
  • చంద్ర బాబు ఒక అబద్దం... పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు
  • వైఎస్సార్‌సీపీ ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌ ఇస్తే దానిలో కోతలు పెట్టీ మనల్ని బానిసలుగా చేయాలని చూసాడు
  • రైతులు, డ్వాక్రారుణమాఫీ అంటూ  వారిని చంద్రబాబు మోసం చేశాడు
  • రూ. 2 లక్షల 60వేల కోట్లు పేదలకు చేరువ చేశారు సీఎం జగన్‌
  • కరోనాలో  ఆదుకున్నది ఎవరు?
  • అబద్దం చంద్రబాబు.. నిజం సీఎం జగన్‌
  • పప్పు లోకేష్ ..ఉప్పు పవన్ కళ్యాణ్
  • పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే ఎల్లో మీడియా ఏడుస్తుంది
  • అబద్దానికి అరు రూపాలు చంద్రబాబు వద్దు.. నిజం సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కావాలి

05:24PM, Dec 17th, 2023

జగనన్నలాగా ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక న్యాయం పాటించలేదు: హోం మంత్రి తానేటి వనిత 

  • జ్యోతిరావు పూలే బాబు జగజీవన్ రావ్ ఆశయాలను ఆచరణలో చూపారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • అన్ని రంగాల్లో వినూత్నమైన మార్పులు..తీసుకొచ్చారు
  • ఎవ్వరూ బాల కార్మికులు ,డ్రాప్ అవుట్స్ ఉండకూడదనీ అమ్మ ఒడి పథకం తెచ్చారు
  • గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎం ను చూసారా....?
  • సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు,ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు
  • మహిళా సాధికారత కోసం చేయూత ,కాపు నేస్తం, ఇచ్చారు
  • అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న
  • 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు
  • మహిళకుపుట్టించి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు
  • గ్రామ సచివాలయం వ్యవస్థ తో పాలన మన ముంగిటకు చేర్చారు జగనన్న
  • ప్రజల్లోకి వెళ్ళ లేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్లపై బురద చల్లుతున్నారు
  • ట్యాబ్‌లను సైతం  రాజకీయలకు వాడుకుంటున్నారు
  • డబ్బు ఉన్నదన్న అహంకారం తో ఉన్నారు వారు
  • పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవ వచ్చు కానీ పేదలు చదవ కూడదా...?
  • అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి చూపారు..
  • దళితులకు పెద్ద పీట వేస్తూ... నన్ను హోం మంత్రిగా చేశారు
  • జననన్నే మన భవిష్యత్
  • గోపాల పురం నియోజిక వర్గం  వైసీపీ అడ్డా

05:20PM, Dec 17, 2023

11 శాతంలో ఉన్న పేదరికాన్ని  ఆరు శాతంకు తెచ్చారు సీఎం జగన్‌:  మంత్రి కారుమూరి

  • దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు
  • 3.9 శాతం ఉండే వ్యవసాయం 11.5శాతంకు చేరింది సీఎం జగన్‌ హయాంలోనే..
  • అమ్మ ఒడి తో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు
  • 65వేల కోట్లు పిల్లల విద్యకు కర్చు పెట్టారు
  • పెత్తందారులు ఎల్లో మీడియా చంద్రబాబు పేద పిల్లల విద్యపై  విషం చిమ్ముతున్నారు... 
  • పిల్లల భవిష్యత్ కోసం కృషి చేస్తున్నారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోతో వచ్చిన రోజు.. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అండగా ఉండం చూసి  వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి.

5:01PM, Dec 17, 2023

విజయవాడలో బీసీ సంఘాలు, మేధావుల సమావేశం

  • 40కి పైగా బీసీ కుల సంఘాలు కలిసి ఏకవాక్య తీర్మానం
  • బెజవాడ ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్
  • విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ అన్ని పార్టీలు ఈసారి బీసీలకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా: మారేష్

04:29PM, Dec 17, 2023

విశాఖ:

సీఎం వైఎస్ జగన్ గొప్ప సంఘ సంస్కర్త: ఎంపీ ఆర్‌ కృష్ణయ్య

  • సామాజిక న్యాయానికి దేశంలోనే ఆదర్శ నేతగా నిలిచారు
  • బడుగు బలహీన వర్గాల వారు ఉన్న జనాభా కంటే ఆదనంగా పదవులు ఇచ్చారు
  • బీసీ, ఎస్సీ సీఎంలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తు సామాజిక న్యాయం జరగలేదు
  • సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ సృష్టించారు
  • సామాజిక సాధికార యాత్ర అనుకున్న దానికంటే విజయవంతమైంది
  • బడుగు బలహీన వర్గాల వారిని రాజ్యాధికారంలో సీఎం జగన్ భాగస్వామ్యులను చేశారు
  • చంద్రబాబు పాలనలో సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమైంది
  • బడుగు బలహీన వర్గాల వారిని చంద్రబాబు అవమానించారు

04:24PM, Dec 17, 2023

  • ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారు: చంద్రబాబు
  • స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని నిర్వీర్యం చేశారు

అయ్యా చంద్రబాబు.. ఒకసారి నిజాలు ఏంటో పరిశీలిద్దామా?

  • రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలను లాక్కుంది నువ్వు కాదా.?
  • ల్యాండ్ పోలింగ్ అంటూ కొత్త పదాలు చెప్పి సింగపూర్ వాళ్ళతో చేతులు కలిపి కుంభకోణానికి తెరలేపింది నువ్వు కదా??
  • సింగపూర్ ప్రభుత్వమని చెప్పి ప్రైవేట్ వ్యక్తులతో లాలూచీ పడింది నువ్వు కాదా..? 
  • నీ ఐదేళ్ల పాలనలో గ్రాఫిక్స్ మాయాజాలం తప్పించి ఇంకేం చేశావు చంద్రబాబు?
  • నిన్ను నమ్మిన రైతులకు వెన్నుపోటు పొడిచి నట్టేట ముంచావు కదా చంద్రబాబు?
  • మూడు రాజధానులు ఏర్పాటు చేద్దామని అంటే కోర్టులో వందల పిటిషన్ వేయించింది నువ్వు కాదా చంద్రబాబు??
  • నీ పరపతి అడ్డుపెట్టుకొని రాజధానికి అడుగు ముందుకు పడకుండా చేసింది నువ్వు కాదా చంద్రబాబు?
  • చేసిందంతా చేసి ఇప్పుడు రాజధాని లేదని అంటావా? 
  • చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

04:22PM, Dec 17, 2023

బీజేపీ పట్ల మా వైఖరి పాజిటివ్ గానే ఉంటుంది .. మాతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నా : నాగబాబు 

నాగబాబు గారు ఓసారి పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూడండి

  • మీ అసలు రూపం తెలుసుకుని బిజెపి మిమ్మల్ని దూరం పెట్టిందని తెలుసుకోండి
  • లోకసభ ఎన్నికల్లో మీ  అవసరం లేదని బీజేపీ తెగేసి చెప్పారు.. తెలుసుకోండి
  • మీరు పాజిటివ్‌గా ఉండడం కాదు మీ పట్ల జనమంతా నెగిటివ్గా ఉన్నారని తెలుసుకోండి
  • పార్ట్ టైం పాలిటిక్స్ పక్కన పెట్టి ఇకనైనా నిజాలు మాట్లాడండి
  • నాగబాబు తీరుపై వైఎస్ఆర్సిపి విమర్శలు

04:21PM, Dec 17th, 2023

అక్రమ ఓటు దరఖాస్తు వ్యవహారం బయటపడడంతో వివరణ ఇచ్చుకున్న నాగబాబు

  • నిజంగా ఏపీకి మారాలి అనుకుంటే తెలంగాణ ఎన్నికల ముందు ఎందుకు దరఖాస్తు చేసుకోలేదు? 
  • మంగళగిరిలో దరఖాస్తు చేసుకున్న విషయం బయటపడడంతో ఇక్కడికి మార్చుకుంటున్నట్టు చెబుతున్న వివరణలో ఎంతవరకు నిజం? 
  • లోకేష్ ముగింపు సభకు పవన్ డుమ్మా కొట్టడం, సోమిరెడ్డి దీక్షకు నాగబాబు డుమ్మా కొట్టడం దేనికి సంకేతం?
  • నెల్లూరులో మీడియా తో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు 
  • జనసేన ను బలోపేతం చేయడమే నా లక్ష్యం - నాకు పదవులపై ఎలాంటి కోరికలు లేవు - నేను నా ఓటును ఏపీకి మార్చుకున్నాను
  • తెలంగాణ ఎన్నికల్లో నేను గానీ నా భార్య గానీ ఓటు వేయలేదు
  •  ఎన్నికల స్పిరిట్ ను పోగొట్టవద్దని ఓటు వేయలేదు
  • నేను నా ఓటును ఏపీకి మార్చుకున్నాను

04:20PM, Dec 17th, 2023

నాకు రాజకీయ పదవుల పై ఆసక్తి లేదు: నాగబాబు

  • ఎంపీగా పోటీ చేస్తున్నాననేది అబద్దపు ప్రచారం
  • మైనింగ్ పై సోమిరెడ్డి చేస్తున్న దీక్షకు సమయం లేక వెళ్లలేదు
  • నాకు ఏపీ, తెలంగాణలో ఓటు ఉందనేది అసత్యం 
  •  నాకు హైదరాబాద్ లో ఓటుంది కాని మొన్నటి ఎన్నికల్లో వేయలేదు 
  • మంగళగిరికి వచ్చేయడంతో ఓటు మార్చాలని దరఖాస్తు చేశా 
  • నెల్లూరులో మీడియా తో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు 
  • జనసేన ను బలోపేతం చేయడమే నా లక్ష్యం
  • నాకు పదవులపై ఎలాంటి కోరికలు లేవు
     

03:01PM, Dec 17th, 2023

తండ్రి ఆరు అబద్దాలు అయితే లోకేష్ 12 అబద్ధాలు: మంత్రి వేణు

  • గత పాలకులు ఇచ్చిన మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి
  • గతంలో సామాజిక న్యాయం అనేది ఎండమావి.. నేడు నిండు కుండ...
  • గత పాలకులు ఎస్సీలను వివక్షతో చూశారు
  • గత పాలకులు అనేక వర్గాల పేదలను వివక్షతో చూశారు
  • దళారులు లేకుండా పేదవారి గడపలకు సంక్షేమాన్ని చేర్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • పేదవారి మోసపోకుండా అవినీతి అనే పదానికి తావు లేకుండా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు
  • 2 లక్షల60 వేల కోట్లు నేరుగా పేదలకు ఖాతాలకు చేర్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  •  గతంలో పాలకులు ఐదేళ్ల తర్వాత హామీల గురించి ఆలోచించేవారు
  • అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి
  • పదవుల్లోనే కాదు ప్రజా అవసరాలను తీర్చడంలో సంక్షేమానికి పెద్దపీటవేశారు
  • అమలు చేసేవాడు మంచి వాడైతేనే పేదలకు మేలు జరుగుతుంది అన్న అంబేద్కర్ ఆశయాలను నిజం చేశాడు
  • పేదవాడికి విద్య అనేది పెద్ద ఆయుధం అని అంబేద్కర్ అన్నారు..
  • 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నేడు గజగజగజ వణికి పోతున్నాడు
  • చంద్రబాబుకి ప్రజలను ఎలా మోసం చేయాలో అని ఆలోచిస్తున్నాడు..
  • ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదు
  • మోసానికి ఒక చిరునామా అబద్ధానికి ఒక చిరునామా వంచన ఒక చిరునామా చంద్రబాబు..
  • నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం ఎంత స్థాయికి అయిన దిగజారే వ్యక్తి చంద్రబాబు
  • విలువలే పెట్టుబడిగా సత్యమేవ జయతే అన్న రీతిలో పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • అమ్మ ఒడి తగ్గిపోయిందని ఈనాడు రాసింది నువ్వు ఎవడు మాట్లాడటానికి.
  • గతంలో పిల్లలు బడిబాట పట్టేవారు కాదు గొప్ప సంస్కర్తగా పాలన నిర్ణయాలు తీసుకుని విద్యకు పెద్దపీద్ద వేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • కరోనాలో నువ్వు నీ కొడుకు నీ దత్తపుత్రుడు ఎక్కడున్నారు
  • సంస్కర్తకు సాధికారత యాత్ర ఒక సలాం కొడుతుంది.
  • కష్టంలో ఉన్న ప్రజలకు సంరక్షించే సంస్కర్త సంస్కారిగా సంరక్షకుడుగా మారి ఈనాడు పాలన సాగిస్తున్నాడు..
  • చంద్రబాబు హయాంలో పట్టిసీమ పోలవరం అమరావతి అంతా అవినీతి..
  • చంద్రబాబు ఏ స్కీం తీసుకున్న అంతా స్కామే.
  • 2,60,000 కోట్లు పేదలకు పంచాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • మూడు పత్రికలు రెండు టీవీలు ఇద్దరు యాక్టర్లు అబద్దానికి ఆరు ముఖాలుగా మారారు
  • తండ్రి ఆరు అబద్దాలు అయితే తనయుడు లోకేష్ 12 అబద్ధాలు

1:30 PM, Dec 17th, 2023
వైఎస్సార్‌సీపి అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కామెంట్లు..
• నారా లోకేష్ పాదయాత్ర వలన ఏం ప్రయోజనం చేకూరింది?
• పేద పిల్లలు చదువు కుంటే ఎందుకు కుళ్లుకుంటున్నారు?
• చంద్రబాబు పాలనలో ఏ ఒక్క‌ పథకమైనా గుర్తు పెట్టుకునేది ఉందా? 
• అసలు చంద్రబాబును మళ్లీ ఎందుకు గెలిపించాలి?
• 14 ఏళ్ల మీ పాలనలో ఏం చేశారు?
• వైఎస్సార్ అంటే ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ గుర్తుకువస్తుంది.
• చంద్రబాబుకు  మేనేజ్ చేయటం మాత్రమే తెలుసు
• జగన్ క్రియేట్ చేసి చూపిస్తారు
• లోకేష్.. చంద్రబాబు కొడుకు కాకపోతే ఎన్టీఆర్ ట్రస్టు గేటు తుడవటానికి కూడా పనికిరాడు
• జగన్ నమ్మకానికి అమ్మ వంటి వారు
• చంద్రబాబు నమ్మకాన్ని అమ్ముకునేవాడు 
• మోసం,దగా,కుట్ర చంద్రబాబు డీఎన్‌ఏ
• అమరావతి డ్రామా కంపెనీలాగ మార్చారు 
• తన ధనదాహాన్ని తీర్చుకోవటానికే అమరావతిని సృష్టించారు 
• అమరావతి ప్రజా రాజధాని కాదు 
• ప్యాకేజీ పదేళ్లపాటు పవన్ మాట్లాడుకున్నారు
• అందుకే పదేళ్లు పొత్తు అంటున్నారు
• సీట్ల గురించి ఇంకా తేలనందునే పవన్ యువగళం ముగింపు సభకు వెళ్లటం లేదు
• చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు?
• ఎస్సీలైన అనిత, జవహార్‌లను చంద్రబాబు ఎందుకు ట్రాన్సఫర్ చేశారు?

1:09 PM, Dec 17th, 2023
రామోజీ రావు ఒక పొలిటికల్‌ బ్రోకర్‌: పోసాని కృష్ణమురళి

  • వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరిక
  • కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటున్నారు
  • విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్‌లు ఇస్తే వాటిలో చెడు వీడియోలు చూస్తున్నారంటూ రామోజీ ప్రచారం చేస్తున్నాడు
  • పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నాడు 
  • ట్యాబ్‌లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని, ఇతర ఏవీ కూడా ఓపెన్ కాకుండా లాక్ ఉంటుంది
  • 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో తాను అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశా
  • రామోజీ చాలా నిజాయతిపరుడని అప్పట్లో అనుకున్నా
  • కానీ రామోజీరావు పేదల డబ్బులను దోచుకుతింటున్నాడు
  • ఒక్కో మార్గదర్శి మేనేజర్ నెలకు రూ.పది లక్షలు సంపాదిస్తున్నారు

1:00 PM, Dec 17th, 2023
అమరావతి పేరిట భ్రమరావతి సృష్టించిన చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట ఏం కుంభకోణం చేశాడంటే?

  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

12:29 PM, Dec 17th, 2023
అమరావతి.. అసలు నిజాలు..

అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి

అమరావతి గురించి జడ శ్రవణ్‌ స్వయంగా చెప్పిన మాటలు ఇవి

  • తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్‌
  • అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే
  • భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే
  • 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు..
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే
  • ఏ మేధావి వచ్చినా నేను  చర్చకు సిద్ధం : జడ శ్రవణ్‌
  • అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్‌
  • రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే
  • లోకేష్‌.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్‌
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా?
  • మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్‌ఛార్జీని బకరా చేస్తారా?
  • ఇదా తెలుగుదేశం నైజం.?
  • సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా?
  • రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా?
  • తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్‌ బుక్‌ ఎక్కుతారు..!
  • వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ
  • డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు
  • రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి
  • మీకు అసలు మీ పార్టీ క్యాడర్‌ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?


(ఫైల్‌ఫోటో : లోకేష్‌తో జడ శ్రవణ్‌)

11:58 AM, Dec 17th, 2023
యాదవులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది

  • విశాఖ: వైఎస్సార్‌సీపీ యాదవ నేతల మీడియా సమావేశం
  • టీటీడీలో సన్నిధిగొల్లను చంద్రబాబు తొలగించారు
  • వైఎస్ జగన్ సీఎం అయ్యాక సన్నిధి గొల్లను ఏర్పాటు చేశారు
  • ప్రతిపక్షంలో ఉన్నపుడే జంగా కృష్ణమూర్తి యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు
  • గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా యాదవ మహిళను సీఎం జగన్ నియమించారు
  • వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు
  • VMRDA ఛైర్మన్ పదవి యాదవ కులానికి ఇచ్చారు
  • యాదవులకు అనేక నామినేటెడ్ పదవులు అప్పగించారు
  • బీద మస్తాన్‌రావును రాజ్య సభకు పంపారు
  • అనిల్ కుమార్ యాదవ్, కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవులు ఇచ్చారు
  • యాదవులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
  • గాజువాకలో టీడీపీ నేత పల్లా శ్రీనుకు చంద్రబాబు అన్యాయం చేశారు
  • పవన్ కళ్యాణ్ కోసం గాజువాకలో పల్లా శ్రీనివాస్ తరుపున ప్రచారం కూడా చేయలేదు

11:28 AM, Dec 17th, 2023
చంద్రబాబు, లోకేష్‌కు షాక్ ఇచ్చిన పవన్

  • యువగళం ముగింపు సభకు రాలేనని స్పష్టం చేసిన పవన్
  • ఈనెల 20 వ తేదీన యువగళం ముగింపు
  • బహిరంగ సభకు రావాలని పవన్ కు చంద్రబాబు విజ్ఞప్తి
  • తనకు వేరే షెడ్యూల్ ఉందని రాలేనని చెప్పిన పవన్
  • యువగళం ముగింపు సభకు వెళ్లట్లేదని జనసేన నేతలకు స్పష్టం చేసిన పవన్
  • టీడీపీ-జనసేన మధ్య సీట్లు సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతోనే పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఉన్నట్లు జనసేనలో ప్రచారం

10:50 AM, Dec 17th, 2023
నేడు 32వ రోజు సామాజిక సాధికార యాత్ర

  • కర్నూలు, గోపాలపురం, నందిగామ నియోజకవర్గాలలో జరగనున్న బస్సుయాత్ర
  • కర్నూలులో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • ఉదయం 11 గంటలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు  వైసీపి నేతల విలేకరుల సమావేశం
  • అనంతరం కర్నూలు పాత బస్టాండ్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ
  • హాజరుకానున్న మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆది మూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు  మోపిదేవి వెంకటరమణ తదితరులు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో బస్సు యాత్ర

  • మధ్యాహ్నం ఒంటి గంటకు యర్నగూడెంలోని రెడ్డి కళ్యాణ మండపంలో మంత్రుల మీడియా సమావేశం
  • అనంతరం కృష్ణాయ పాలెం మీదుగా దేవరపల్లి వరకు ఐదు కిలోమీటర్లు బైక్ ర్యాలీ
  • మూడు గంటలకు దేవరపల్లి సెంటర్లో  బహిరంగ సభ
  • పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో

  • ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • సాయంత్రం 3:30 గంటలకు నందిగామ శివారు బైపాస్ (పాత కాకతీయ రెస్టారెంట్) నుంచి ర్యాలీ
  • 4 గంటలకు గాంధీ సెంటర్‌లో బహిరంగ సభ
  • పాల్గొననున్న మంత్రులు మేరుగు నాగార్జున, అంజాద్ బాషా, జోగి రమేష్, తదితరులు

10:48 AM, Dec 17th, 2023
అడ్డంగా దొరికిపోయిన నారా లోకేశ్‌.. 

  • యువగళానికి స్పందన లేకపోవడంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎత్తులు
  • అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేట వద్ద గుంతల్లో నీరుపోసి ఫొటోలకు ఫోజులు
  • నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్టుగా ఉంది టీడీపీ నేత నారా లోకేశ్‌ తీరు.
  • అనకాపల్లి జిల్లాలో ఈ నెల 7వ తేదీతో పోయన మిచాంగ్‌ తుపాను ప్రభావం 
  • అప్పటినుంచి చినుకు జాడలేదు. 
  • గడచిన వారం రోజుల్లో పొలాలు అన్నీ తడారిపోయాయి
  • కల్లాల్లోని వరి పంట కడ దశకు చేరుకుంది
  • కానీ.. లోకేశ్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్డుపై ఉన్నపళంగా నీళ్లొచ్చాయి
  • అక్కడ పచ్చ చొక్కాలతో కలిసి లోకేశ్‌ ఫొటోలకు ఎడాపెడా ఫోజులిచ్చారు.
  • సెల్ఫీలు తీసుకుని లేనిపోని హడావుడి చేశారు. 
  • ఈ ఫొటోలు ఎల్లో మీడియాకు చేరడంతో ఒక్కసారిగా ఊదరగొట్టేశాయి.
  • ఆ రాతలు చూసి అవాక్కయిన స్థానికులు

9:39 AM, Dec 17th, 2023
చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

  • నీకంత సీన్‌ ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీచేయగలవా?
  • మా పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్లలో మార్పులు
  • ఇప్పుడు మళ్లీ 175కి 175 గెలిచే దిశగా అడుగులు వేస్తున్నాం
  • వైఎస్‌ జగనే మళ్లీ సీఎం కావాలని 60 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు
  • యువగళం పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్‌ 
     

7:57 AM, Dec 17th, 2023
అధికారం కోసం టీడీపీ అడ్డదారులు

  • 10 లక్షలకుపైగా ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర
  • మైపార్టీ డ్యాష్‌ బోర్డు.కామ్‌ పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచార సేకరణ 
  • వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యం
  • రకరకాల సాకులు చూపిస్తూ ఓట్ల తొలగింపు దరఖాస్తులు
  • చనిపోయారని, నకిలీవని, వలసపోయారని, రెండుచోట్ల ఉన్నాయని దొంగ అప్పీళ్లు
  • పది లక్షల ఓట్లు తొలగించాలని డిమాండ్‌
  • టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ ఫారం 7ల గంపగుత్త దరఖాస్తులు
  • అందులో సింహభాగం తప్పుడు దరఖాస్తులేనని తేల్చిన అధికారులు
  • ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నివేదికలు సమర్పించిన కలెక్టర్లు
  • కుట్రలను రట్టు చేసిన కలెక్టర్లను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న టీడీపీ నేతలు
  • కుప్పంలో 2,435 మంది చనిపోయినట్లుగా సృష్టించిన టీడీపీ
  • పుంగనూరు, నగరి, జీడీ నెల్లూరులోనూ 4,780 మందిని చంపేసిన కోనేరు సురేష్‌
  • తప్పుడు సమాచారంతో ఫారం–7లు దరఖాస్తు చేయడం ఐపీసీలో సెక్షన్‌–182 ప్రకారం నేరం
  • ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లో సెక్షన్‌ 31 ప్రకారం ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం
  • వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే ఆందోళనతో యథావిధిగా తెలుగుదేశం అడ్డదారులు
  • ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించి.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ
  • 2015–17 మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన 50.23 లక్షల ఓట్లు సేవా మిత్ర యాప్‌తో తొలగింపు
  • వాటిపై అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
  • విచారణ జరిపి 2019లో 31.97 లక్షల ఓట్లను జాబితాలో చేర్చిన ఎన్నికల సంఘం 
     

7:31 AM, Dec 17th, 2023
చంద్రబాబు, పవన్‌కు భేదాభిప్రాయాలు వచ్చాయా?

  • యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ ఎందుకు డుమ్మా కొడుతున్నట్టు? 
  • పొత్తుల తక్కెడలో పవన్ అడిగిన అన్ని సీట్లు చంద్రబాబు ఇవ్వడం లేదా? 
  • 50 ఎమ్మెల్యే టికెట్లు 5 ఎంపీ టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు ససేమిరా అంటున్నాడా?
  • జైలు ముందు చేసిన పొత్తు ప్రకటన ఎన్నికల దాకా ఉంటుందా? 
  • యువగళం ముగింపు సభకు గైర్హాజర్ కావాలన్నా పవన్ నిర్ణయం దీనికి సంకేతం?

7:00 AM, Dec 17th, 2023
ఏపీలో దొంగ ఓట్ల చేరికల్లో జనసేన కుట్ర

  • మంగళగిరి నియోజకవర్గంలోని రాధారంగా నగర్ లోని 5-263 డోర్ నెంబర్లో ఉంటున్నట్లుగా ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు
  • ఇంటి నెంబర్ 5-263 తో ఉన్న ఇల్లు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ దిగా గుర్తింపు
  • 5-263 డోర్ నెంబర్ పై 50 మంది ఓట్లు దరఖాస్తులు
  • దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు
>
మరిన్ని వార్తలు