ఈ టైమ్‌లో ఏం చేయలేనని క్లారిటీ..!

17 Dec, 2023 19:44 IST|Sakshi

పేషెంట్‌ను పరుగుపరుగున ఆస్పత్రికి తీసుకొచ్చారు.. డాక్టర్ కూడా కంగారుగా వచ్చి చూశారు .. అన్ని పరీక్షలు చేశారు.. అన్నీ చెక్ చేశారు... బంధుమిత్రులు అందరూ ఆతృతతో చూస్తున్నారు.. డాక్టర్ ఏమి చెబుతారో... మా తాత ఎప్పటికి మామూలు మనిషి అవుతాడో అని ఆశగా చూస్తున్నారు. డాక్టర్ కళ్ళజోడు తీసాడు.. మెల్లగా సర్దుకుని.. లేదు.. అంతా అయిపొయింది.. లోపల సామాన్లు అన్నీ కుళ్లిపోయాయి.. మహా అయితే మూణ్నెల్లు ఉంటాడు... ఈలోపు అన్నీ సర్దేయండి.. అయన చివరికోరికలు ఏమైనా ఉంటే తీర్చేయండి.. అని చెప్పి బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయారు.

తెలుగుదేశానికి కూడా ఇదే సమాధానం ఎదురైంది. ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ను తమకు సాయం చేయాల్సిందిగా టీడీపీ కోరింది. ప్రస్తుతం తెలుగుదేశానికి రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు.. బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ ఇలాంటి ప్రోగ్రాములన్నీ ఆయనే డిజైన్ చేశారు. కానీ సీఎం వైయస్ జగన్ను అడ్డుకోవడానికి అవేం పెద్దగా పనికిరాలేదు. దీంతో ఈసారి ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి  దించాలని భావించారు. ఈనేపథ్యంలోనే  చంద్రబాబు అరెస్ట్ అయి  జైల్లో ఉన్నన్ని రోజులు లోకేష్ ఢిల్లీలో మకాం వేసి ప్రశాంత్ కిషోర్ ను కలవగలిగారు.. అయన వచ్చి ఇక్కడ లోకేష్ ఇతర పెద్దలతో మాట్లాడారు.. చంద్రబాబును, ఇతర సీనియర్లు.. ఇంకా రాబిన్ శర్మను సైతం కలిసి చర్చించారు.

రానున్న ఎన్నికల్లో తమను ఎలాగైనా గెలిపించాలని, ఎంత బడ్జెట్‌ అయినా పర్లేదని, కొత్తకొత్త ఆలోచనలు, ప్లాన్లు వేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ను బదనాం చేయాలని కోరారు. ఇంతవరకూ తాము చేస్తున్న పార్టీ ప్రచారం... ఇతర కార్యక్రమాలను వివరించి.. ఇంకేం చేయాలి.. ఎలా చేస్తే అధికారంలోకి వస్తామో సలహాలు.. సూచనలు చేయాలనీ, దీనికి ఎంత డబ్బు ఇమ్మన్నా ఇస్తామని అన్నారు. ప్రభుత్వంపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని కొంత ఎగదోస్తే చాలని, తాను సీఎం అయ్యాక ఏది కావాలంటే అది ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.

అంతా విన్న ప్రశాంత్ కిషోర్‌ సమయం మించిపోయిందని, తానిప్పుడు ఏమీ చేయలేనని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే పలు ప్రోగ్రాములతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ప్రజల్లో ఉందని, ఆ పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ .. ఈ తరుణంలో జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని చెప్పినట్లు తెలిసింది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఇప్పుడు మనం ఎకాఎకిన వ్యతిరేకతను పోగుచేయలేమని చెప్పడంతో తండ్రీకొడుకులు ఉసూరుమన్నారని తెలిసింది.

ఇదీచదవండి..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు..?

>
మరిన్ని వార్తలు