మూడు రాష్ట్రాల్లో కమలం హవా..

3 Dec, 2023 21:55 IST|Sakshi

దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో కమలం వికసించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ భారీ స్థాయిలో విజయం సాధించింది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకుగాను బీజేపీ 163 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకు పరిమితమైంది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.

రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 69 సీట్లను మాత్రమే గెలిచింది. ఇతరులు మరో 15 సీట్లను సొంతం చేసుకున్నారు.   అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే.. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది. ఇతరులు 1 సీటును సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ 39 సీట్లలో బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్‌. కాంగ్రెస్‌ 28 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్‌లో 86 స్థానాల్లో లీడ్‌లో బీజేపీ ఉంది. కాంగ్రెస్‌ 64, సీపీఎం 2, ఇతరులు 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి రౌండ్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజలో ఉండగా, పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజలో ఉన్నారు.

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో మొదలైంది. 11 గంటలకల్లా ఫలితాల సరళిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ నెగ్గవచ్చని, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందనే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఉన్నాయి. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మూడుచోట్ల ముఖాముఖి
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్‌ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.


► నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
► తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు.
► అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్‌ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.  

మధ్యప్రదేశ్‌
రాష్ట్రంలో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సాగుతోంది. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్‌ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి. 2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్‌ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది.
రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230
మెజారిటీ మార్కు: 116

రాజస్తాన్‌
ఈ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్తాన్‌ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం గెహ్లోత్‌ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్‌ యువ నేత సచిన్‌ పైలట్‌ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు.
రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200
మెజారిటీ మార్కు: 101

ఛత్తీస్‌గఢ్‌
రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సాగుతోంది. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్‌ అధికారులు, 416 మంది సహాయ రిటరి్నంగ్‌ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి సీఎం భూపేశ్‌ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తదితర ప్రముఖులున్నారు.  
రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90
మెజారిటీ మార్కు:46

మరిన్ని వార్తలు