బీజేపీలో ‘బీఫామ్‌’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత

10 Nov, 2023 14:39 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీఫామ్‌లు మంటలు రేపుతున్నాయి. అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి బీఫామ్‌ మరొకరికి ఇవ్వడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సంగారెడ్డి రిటర్నింగ్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

టికెట్‌ ఇచ్చి బీఫామ్‌ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్వో కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నిరసన తెలిపారు. బీఫామ్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ దేశ్‌పాండే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సంగారెడ్డి బీఫామ్‌ను పులిమామిడి రాజుకు బీజేపీ అధిష్టానం బీఫామ్‌ అందించింది.

కాగా, వేములవాడ బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్‌రావుకు చివరి క్షణంలో బీజేపీ అధిష్టానం బీఫామ్‌ అందించింది. ఇప్పటికే తుల ఉమ నామినేషన్‌ దాఖలు చేయగా, వికాష్‌రావు తరపున ఆయన అనుచరులు నామినేషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు