దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌

30 Oct, 2021 10:13 IST|Sakshi

పోలింగ్‌ అప్డేట్స్‌:
 

► దాద్రానగర్ హావేలీలో సాయంత్రం 5 గంటల సమయానికి 66. 99శాతం పోలింగ్‌ నమోదు. 
► బీహార్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 49.85 శాతం పోలింగ్‌ నమోదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్‌లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది.
► మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 63.02 శాతం పోలింగ్‌ నమోదు. మరోవైపు ఖాండ్వా లోక్‌ సభ నియోజకవర్గంలో 59.02 శాతం పోలింగ్‌ నమోదు. 
► రాజస్థాన్‌లోని ధరియావాడ్‌, వల్లభనగర్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి సరాసరిగా 65 శాతం పోలింగ్‌ నమోదు.
► హిమాచల్‌ ప్రదేశ్‌ ఉపఎన్నికలో జుబ్బల్-కోట్‌ఖాయ్‌లో సాయంత్రం 4 గంటల వరకు 65.88 శాతం, మండిలో 47.17 శాతం పోలింగ్ నమోదైంది.
►మేఘాలయాలో 78 శాతం మేర పోలింగ్‌ నమోదు.
 

► బెంగాల్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్‌
►రాజస్తాన్‌  మధ్యాహ్నం 3 గంటల వరకు 53.69 శాతం పోలింగ్
►దాద్రానగర్‌ హవేలీ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.71 శాతం పోలింగ్‌
►మేఘాలయ బైపోల్స్‌లో రికార్డుస్థాయిలో పోలింగ్‌ జరుగుతోంది. 3 గంటల సమయానికి 64 శాతం మేర ఓట్లు పోలయ్యాయి.
►భారత మొదటి ఓటరు..104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి, శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కల్పా మోడల్ పోలింగ్ స్టేషన్‌లో మండి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఓటు వేశారు. 

►హర్యానాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్‌
► బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్‌
►రాజస్తాన్‌  మధ్యాహ్నం 1 గంట వరకు 40.64 శాతం పోలింగ్
►అస్సాంలో ఉదయం 1 గంట వరకు 51 శాతం పోలింగ్‌
►బిహార్‌లో 1 గంటకు 38 శాతం పోలింగ్‌
► మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ స్ధానాలకు 45.67 శాతం పోలింగ్‌ ( మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్‌సభ స్థానాలకు 39.08 శాతం పోలింగ్‌( మధ్యాహ్నం 1 గంట వరకు)  

►దాద్రానగర్‌ హవేలీ ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్‌
►రాజస్తాన్‌ 11 గంటల వరకు 25 శాతం పోలింగ్‌
►కర్ణాటక 10.30 గంటల వరకు 9.77 శాతం పోలింగ్‌

►బిహార్‌లో ఉదయం 11 గంటలకు 21.79 శాతం
►హర్యానాలో ఉదయం 10 గంటల వరకు 10 శాతం
►అస్సాంలో ఉదయం 10 గంటల వరకు 12 శాతం
►మిజోరాంలో ఉదయం 10 గంటల వరకు 17 శాతం
►కర్ణాటకలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం
► బెంగాల్‌లో ఉదయం  9 గంటలకు 10 శాతానికి పైగా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేళి, డామన్‌ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ రాత్రి 7 గంటలకు కొనసాగుతుంది.

ఎన్నికలు జరుగుతున్న స్థానాలు
దాద్రానగర్‌ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరగుతుండగా.. అసోంలో 5, బెంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బీహార్‌లో2, కర్ణాటకలో2, రాజస్థాన్‌లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలోని ఒక్కో స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి.
చదవండి: విశ్వాసం అంటే ఇదేరా ! 
 

మరిన్ని వార్తలు