నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!

22 Feb, 2021 11:16 IST|Sakshi

శాంతిపురం(చిత్తూరు జిల్లా): కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరా జయం పాలైంది. ఈ నేపథ్యంలో టీడీపీని కాపాడుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వయత్నాలు చేస్తున్నారు. రెండు రోజులుగా పలువురు టీడీపీ నాయకులకు ఫోన్లు చేసి, ధైర్య వచనాలు వినిపిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కీలక నాయకులతోపాటు కింది స్థాయి వారికి కూడా అధినేత నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇకపై తన మార్గంలో తాను కుప్పం నుంచి సమాచారం తెప్పించుకుని, పార్టీ వ్యవహారాలను స్వ యంగా చూసుకుంటానని చెబుతున్నట్టు సమాచారం.

టీడీపీ అధికారం కోల్పోయాక టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్‌ మీటింగులకు పరిమితమైన చంద్రబాబు ఇప్పుడు నేరుగా ఫో న్లలో మాట్లాడుతుండటం విశేషం. తాను నమ్మిన కొందరు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా అంతా బాగుందని నమ్మించారని ఆయన చెప్పినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉండగా అడ్డంగా సంపాదించుకున్న వారు ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్లడం, ఉన్న వారు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో సమస్య వచ్చిందని ఆయన సముదాయిస్తున్నారు. కొందరు ఇచ్చిన సమాచారాన్ని నమ్మి అంతా బాగుందని అనుకుంటే ఫలితాలు తారుమారయ్యా యని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు మళ్లీ గ్రామాల్లోకి వె ళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలావుండగా కొందరు టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లినా సొంత పార్టీ వారు కూడా కలవకుండా ముఖం చాటేస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు.
చదవండి:
వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య     
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ

 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు