రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం జగన్‌దే 

14 May, 2023 05:13 IST|Sakshi

 మంత్రి కారుమూరి  

తణుకు అర్బన్‌/అత్తిలి : ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు గిట్టుబాటు ధరను నేరుగా అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మున్సి­పల్‌ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి గింజనూ కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాలకే నగదు జమ చేసిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.

తన ధాన్యం కొనలేదు.. గిట్టుబాటు ధర ఇవ్వలేదు.. అని ఏ ఒక్క రైతూ అననప్పటికీ తగుదునమ్మా అని తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాట పాదయాత్ర, సభ జనాదరణ లేక అట్టర్‌ ఫ్లాప్‌ షో అయ్యాయని చెప్పారు. తన సామాజికవర్గానికి చెందిన తణుకు టీడీపీ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలనే తపనతో ఏదోరకంగా జాకీ లేసి పైకి లేపేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని ఎద్దేవా చేశారు.

ధాన్యం కొనుగోళ్లపై నాలుగేళ్లపాటు మాట్లాడని చంద్రబాబు.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతో తణుకుకు రెండుసార్లు వచ్చాడని దుయ్యబట్టారు. చంద్రబాబు యాత్రలో రైతులు లేకపోగా దూరప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జనంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. బీసీలను ఓటు యంత్రంగా వాడుకునే చంద్రబాబుకు రానున్న రోజుల్లో బీసీలే తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. జనం లేని సభలో టీడీపీ నాయకులు మీడియాపై కూడా దాడులకు దిగే హీనస్థితికి దిగజారిపోయారని మంత్రి కారుమూరి మండిపడ్డారు.    

చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం  
పబొ మగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన రైతు పోరుబాట యాత్రలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ.. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం అత్తిలి, తణుకులో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అత్తిలి మండల అధ్యక్షుడు రంభ సూరిబాబు, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ తదితరులు చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. అత్తిలి బస్‌స్టేషన్‌ సెంటర్‌లో, తణుకు నరేంద్ర సెంటర్‌లో ధర్నా నిర్వహించి చంద్రబాబు దిష్టి»ొమ్మలను దహనం చేశారు. 

మరిన్ని వార్తలు