Assembly Election Results 2023: డిసెంబర్ 6న ఇండియా కూటమి కీలక భేటీ

3 Dec, 2023 16:46 IST|Sakshi

ఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్,  ఛత్తీస్‌గఢ్‌తో సహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6న ఇండియా కూటమి భాగస్వాములతో అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), తృణమూల్ కాంగ్రెస్‌తో సహా కూటమి భాగస్వాములకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమాచారాన్ని అందజేశారు.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం దిశగా అడుగులు వేయడంతో ఇండియా కూటమి తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.

దేశంలో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకమైన విషయం తెలిసిందే. బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో మొదట భేటీ అయ్యారు. అనంతరం బెంగళూరులో జరిగిన సమావేశంలో ఇండియా కూటమిగా నామకరణం చేశారు.

మరిన్ని వార్తలు