రఫెల్‌ డీల్‌ : రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు

22 Aug, 2020 19:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజకీయాల్లో వివాదాల పుట్టగా పేరొందిన రఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్క్ష్యంగా చేసుకుని.. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. భారతీయ ఖజానాను రఫెల్‌ యుద్ధ విమానాల కోసం దోచుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా 2024 ఎన్నికల సమయానికి రఫెల్‌ జెట్స్‌ భారత సైన్యానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, అది తమకు ఎన్నికల్లో ఎంతో లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి  పియూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ తీవ్రంగా ఖండించారు.

భారత సైన్యానికి చెందని రఫెల్‌పై గోయల్‌ ప్రచారం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిజం ఒక్కటే మార్గాలే అనేకం’ అంటూ మహ్మాత్మా గాంధీ సూక్తులను జోడించిన రాహుల్‌ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రఫెల్‌ జెట్స్‌ ఒప్పందం తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఇటీవల ఆరు యుద్ధ విమానులు భారత గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు