వారికి ఓట్లు అడిగే అర్హత లేదు: అంజాద్‌ బాషా

18 Oct, 2021 16:15 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమం నేరుగా ప్రజలకు అందుతోందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు పెట్టామని తెలిపారు. ప్రజల ముందుకెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అవగాహన లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు.. ప్రభుత్వం మీద నిందారోపణలు చేస్తున్నారని అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: డీఎల్‌పై మండిపడ్డ మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు