Telangana Assembly Elections Today Minute To Minute Update
మంథని కాంగ్రెస్‌లోకి చేరికలు
- పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
- ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో రామగిరి మండల ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, ముగ్గురు సర్పంచ్‌లు
- 500 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
కరీంగనగర్‌లో బండి సంజయ్ ప్రచారం
- కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా
- భూకబ్జాలు, లంచాలతో కోట్లు దండుకున్న గంగులా..
- నువ్వా నా గురించి మాట్లాడేది
- మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేని దద్దమ్మవి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నయీం బ్రదర్స్
- ప్రజల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది
ఉప్పల్‌లో కేటీఆర్ రోడ్ షో
- మెట్రో రైల్‌ను ఈసీఐఎల్ వరకు పొడిగిస్తాం
- నియోజకవర్గంలో కొన్ని కొన్ని సమస్యలున్నాయి
- అవన్నీ పరిష్కరిస్తాం
- ఉప్పల్ అభివృద్ది చేసేది కేవలం కేసీఆర్ మాత్రమే
- ఎవరు ఎన్ని చెప్పినా డిసెంబర్ 3న మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ఖైరతాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్ షో
- దానం నాగేందర్ సగం హైదరాబాద్ ఆక్రమించుకున్నాడు
- మూడుసార్లు ఎమ్మెల్యే అయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించాడు
- చింతల రామచంద్రారెడ్డి పాత చింతకాయ పచ్చడి
- దానం, చింతల ఎలా మోసం చేశారో తెలుసు
- బస్తీలో ఇవాళ డబ్బులు ఇచ్చి తర్వాత గుంజుకుంటారు
- బస్తీల్లో పంచాయితీలు పోవాలి
- బీడీలు అమ్ముకునే దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా
- కేసీఆర్ స్టేట్‌ను తాగుబోతుల తెలంగాణగా మార్చాడు
పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి : సీఈఓ వికాస్‌రాజ్
- నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసింది.
- పోలింగ్ అండ్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి
- రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ స్లిప్ పంపిణి జరుగుతోంది
- రెండు మూడు రోజుల్లో స్లిప్‌ల పంపినీ పూర్తవుతుంది
- బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ ప్రారంభం అయింది
- రెగ్యులర్‌గా బ్యాలెట్ యూనిట్స్ 60వేలు వాడుతాం
- హోం ఓటింగ్ ప్రారంభం అయింది
బీఆర్ఎస్ లీగల్ సెల్ చీఫ్ సోమా భరత్ కుమార్
రేవంత్, సునీల్ కనుగోలుపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం
- సీఈఓకు నాలుగు ఫిర్యాదులిచ్చాం
- కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోంది
- చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోంది
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు
- ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దురదృష్టవశాత్తూ ఈసీ చర్యలు తీసుకోలేదు
- అందుకే ఆయన రెచ్చిపోతున్నారు. కేసీఆర్ శిరచ్చేధం చేయాలని రేవంత్ అంటున్నారు
- తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారు
- ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా
- కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది
- ఎలాంటి అనుమతులు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
- దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారు
- 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చాం. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాం
- తెరవెనుక ఉండి సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు
- సునీల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం
- రేవంత్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరం పెట్టాలని కోరాం
- స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరాం
- క్యూన్యూస్ లో కాంగ్రెస్‌కు నేరుగా ప్రచారం చేస్తున్నారు
- చర్యలు తీసుకోవాలని కోరాం
- స్టడీ ఐక్యూ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోంది
- చర్యలు తీసుకోవాలని కోరాం
ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్
- బీజేపీ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనేది సుపరిపాలన కోసమే
- బీజేపీ మానిఫెస్టో ప్రజల మేనిఫెస్టో మిగిలిన పార్టీలవి రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభ సృష్టించేవి
- అప్పు చేసి పప్పు కూడు తినడం ప్రణాళిక కాదు
- ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు
- బతుకును మార్చే మానిఫెస్టో ఇవ్వడంలో మిగిలిన పార్టీలు విఫలం అయ్యాయి
- కర్ణాటక, హిమాచల్‌లో ఇచ్చిన గ్యారంటీల వారంటీ పోయి ప్రజలు తిరగబడ్డారు
- సంక్షేమం ప్రజలకు అందేలా ప్రణాళిక వేశాం
- కాంగ్రెస్,బీఆర్ఎస్ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారు
మిర్యాలగూడ రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్
- తెలంగాణ రాకముందు ఎలా ఉంది
- వచ్చిన తర్వాత ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాలి
- కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు పడ్డాం
- ఇన్వర్టర్, జనరేటర్ పై ఆధారపడ్డారు
- రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కరెంట్ కనిపించడం లేదంట
- కాంగ్రెస్ వాళ్లకి కరెంట్ గురించి మాట్లాడే అర్హత లేదు
- 55 ఏళ్లు దేశాన్ని పాలించిన సన్నాసులు..కాంగ్రెస్ వాళ్లు
- ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు
- రైతు బంధు లాంటి పథకాలు కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపేట్ట లేదు
- ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా ఖర్చు అంటున్నారు
- రైతు బంధు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయండి
నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు
- అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను గమనించాలి
- పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి
- కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నాం
- కాంగ్రెస్‌కు చాన్సిస్తే మళ్లీ ఆగమాగమే
- కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ 50 ఏళ్లు గోసపడింది
- నల్గొండకు ఐటీ టవర్ కూడా వచ్చేసింది
- మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు ప్రచారం చేస్తారు
- తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్
- కోమటిరెడ్డి టైమ్‌లో నల్గొండ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది
- బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం
- కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, కరెంట్ కూడా ఇవ్వలేదు
- కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తామంటున్నరు
- రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడు
మూడు రోజులు తెలంగాణలోనే ప్రధాని మోదీ
- 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్న ప్రధాని మోదీ
- మూడు రోజుల్లో అరు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని
- 22న పవన్‌కళ్యాణ్ వరంగల్ బహిరంగ సభ
- 26న అమిత్ షా తో కలిసి జనసేన అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ సభలో పాల్గొంటారు
గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ రోడ్ షోలో హరీశ్ రావు కామెంట్స్
- నాడు ఇక్కడ చుక్క నీళ్ళు లేని పరిస్థితి
- ఇప్పుడు ఎండాకాలంలో మంచినీళ్లు ఇచ్చింది కేసీఆర్
- 60 ఏళ్ల పాటు ఎంతోమంది మారారు కానీ మంచినీళ్ల సమస్య తీర్చింది కేసీఆర్
- రూ. 2వేల పింఛన్ ఇచ్చి ముసలవ్వలను, తాతలను ఆదుకుంటున్నది కేసీఆరే
- బీడీ కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు.. ధైర్యంగా బతుకుతున్నారు
- ఈసారి కారుని గెలిపిస్తే 5 వేల పింఛన్ చేస్తా అని కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు
- కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక గురి
- చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్
- కాంగ్రెస్సోడు సీఎం నేనంటే నేనని తన్నుకుంటున్నడు
- బీజేపీ వాడు సిలిండర్ వెయ్యి చేసిండు
- బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు చెప్పుకునే ముఖం లేదు
- అందుకే అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- కారు గుర్తుకు ఓటు వేసి, కేసీఆర్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా
బాల్కసుమన్, జగదీష్రెడ్డిలపై సీఈవోకు ఓయూ జేఏసీ ఫిర్యాదు
- చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్
- సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డిపై ఫిర్యాధు చేసిన నాయకులు
- ఆనాడు బాల్క సుమన్ గెలుపు కోసం ప్రచారం చేశాం
- ఇప్పుడు చెన్నూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు
- సూర్యాపేటలో పోలీసులు జగదీష్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు
కోరుట్ల సభలో అమిత్ షా కామెంట్స్
- ఈసారి తెలంగాణలో మూడుసార్లు దీపావళి
- డిసెంబర్ 3న బీజేపీ పవర్లోకి వచ్చాక మూడవ దీపావళి
- జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి
- బీజేపీ పవర్లోకి వస్తే ఉచితంగా అయోధ్య దర్శనం
- ప్రధాని పసుపు బోర్డు ప్రకటించారు
- మూడు షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను మోసం చేశాయి
- నిజామాబాద్‌లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం
స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కామెంట్స్
- అబద్ధాలు ప్రచారం చేస్తారు
- ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి
- ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు
- పదేళ్లపాలనలో జరిగిన అభివృద్ధి చూడండి
- నీటి, కరెంట్ కష్టాలు తీర్చుకున్నాం
- పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు
- కాంగ్రెస్‌కు ఛాన్సిస్తే మళ్లీ ఆగమాగమే
- బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణప్రజల కోసం
- 15 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం
- మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం
- ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్
- అధికారంలో ఉన్నపుడు ఏం చేయకుండా మళ్లీ చాన్సివ్వమంటున్నారు
- ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి
- ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే కదా
- ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా
- రైతుబంధు ఉండాలా వద్దా
- రైతుబంధు రూ.16 వేలు చేస్తాం
- ధరణిని కాంగ్రెస్ నేతలు బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు
- ధరణి ప్లేస్‌లో భూ మాత తీసుకొస్తామంటున్నారు
- కాంగ్రెస్‌ది భూ మాత కాదు భూ మేత
వేములవాడ బీఎస్పీ బహిరంగ సభలో అపశృతి
- టెంట్ కూలి పలువురి గాయాలు
- ఆస్పత్రికి తరలింపు
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కొద్ది నిమిషాల్లో ప్రసంగించాల్సి ఉండగా ఘటన
జనగామ సభలో అమిత్ షా కామెంట్స్
- కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ అవినీతిపరుడు
- అవినీతిపరులు అందరినీ జైలుకు పంపుతం
- 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం
- పవర్లోకి రాగానే స్కామ్‌లపై దర్యాప్తు చేస్తాం
ఆటో డ్రైవర్లకు కొత్త పథకం ప్రకటించిన కేసీఆర్
- మానకొండూరులో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ
- ఆటో డ్రైవర్లకు కొత్త పథకం ప్రకటించిన కేసీఆర్
- బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్యాసింజర్ ఆటోలకు ఫిట్నెస్, పర్మిట్ రద్దు చేస్తాం.
- ఫిట్నెస్ ఫీజు రూ. 700, పర్మిషన్ ఫీజు 500రద్దు
ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన కేసీఆర్
- ఇందరిమ్మ రాజ్యంలో ఎంత సక్కదనం ఉండేదో మాకు తెలుసు.
- ఎమర్జెన్సీ పెట్టి అమాయకులను జైల్లో వేశారు
- ఇందిరమ్మ పాలన బాగుంటే వలసలు ఎందుకు జరిగాయి.
- ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారు.
- ఇందిరమ్మ పాలన సరిగా లేనందునే ఎన్టీఆర్ రూ. 2 కిలో బియ్యం పథకం తెచ్చారు.
- 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరూ
- 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి మాతో పొత్తుపెట్టుకున్నారు
- అభ్యర్థులనే కాదు.. వాళ్ల పార్టీ చరిత్రను కూడా గుర్తుపెట్టుకొని ఓటు వేయాలి.
- ఓటు మీ తలరాతను మారుస్తుంది.
- ఆలోచించి ఓటు వేయకపోతే ఓటే మిమ్మల్ని కాటేస్తుంది.
- పెన్షన్లను రూ.5వేల వరకు పెంచుతాం.
బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరు: రేణుకా చౌదరి
- ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి
- రేణుకా చౌదరి కామెంట్స్..
- రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది
- ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు అడ్డు పడ్డా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్ గెలుస్తాం
- ఆరు గ్యారంటీ లు ప్రజల్లోకి వెళ్లాయి..
- ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు.
- 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హాక్కు కల్పించింది రాజీవ్ గాంధీ.
- బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరు.
- ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రజలు తగిన బుద్ది చెబుతారు.
- ఓట్లకు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.
- మైనారిటీలు కాంగ్రెస్ వెంట ఉన్నారు.
- ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారు.
- మహ్మద్ అజురుద్దీన్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
- కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను.
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో కడుతుండంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కూలిపోతున్నాయి
- మా హయంలో లక్షలాది మంది ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించాం.
- చంద్రబాబుకు గతంలో మేము సహకరించాం.. ఇప్పుడు ఆయన మాకు సపోర్టు ఇస్తున్నారు.
- కేటీఆర్ ఐటీ కింగ్ అంటారు. కానీ, జాబ్స్ మాత్రం ఇవ్వరు.
- సీఎం పదవిని చాలా మంది ఆశిస్తారు. అది గెలిచ వచ్చిన వారి హాక్కు
- ఈ విషయంలో హై కమాండ్ నిర్ణయం ఫైనల్.
- కర్ణాటకలో డీకే శివ కుమార్‌ను సీఎం అనుకున్నారు.. కానీ, సిద్ద రామయ్య సీఎం అయ్యారు
- ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత సీట్లు కాంగ్రెస్‌కి వస్తాయి.
నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కీలక వ్యాఖ్యలు
- నాకు ప్రాణహాని ఉంది
- కాంగ్రెస్ గూండాల నుండి రక్షణ కల్పించాలి
- పోలీసుల తీరు చాలా బాధాకరం.
- నాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారు
- బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం
- నీలోజిపల్లి గ్రామంలో నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారు.
- ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
- బీఆర్ఎస్ నాయకుడు నాగి శేఖర్‌ను కూడా నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు వెంటాడారు.
- ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
- బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారు.
కరీంనగర్లో కాంగ్రెస్ Vs బీఆర్ఎస్
- చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు.
- రెండు పార్టీల నాయకుల మధ్య తోపులాట.
- కాంగ్రెస్ నాయకులు చంపడానికి వచ్చారని రవి శంకర్ ఆరోపణ.
- కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు.

ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
- నేడు మరోసారి తెలంగాణలో పర్యటించనున్న కేంద్రమంత్రి అమిత్‌షా.
- జనగామ, కోరుట్లలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్న అమిత్ షా.
- జూబ్లీహిల్స్, మల్కాజిగిరి ప్రచారంలో పాల్గొననున్న నిర్మలా సీతారామన్.
తెలంగాణలో మొదలైన హోం ఓటింగ్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదలైన హోం ఓటింగ్
- ఇళ్లకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగుల ఓటింగ్ సేకరిస్తున్న ఎన్నికల సిబ్బంది
- దివ్యాంగులు, వయోవృద్ధులకు హోం హోటింగ్ వేయిస్తున్న ఎన్నికల సిబ్బంది
- దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు అవకాశం కల్పించిన ఈసీ
బండి సంజయ్‌పై గంగుల సెటైర్లు..
- కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్, ఎలబోతారంలో ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్
- ప్రచారంలో బండి సంజయ్‌పై సెటైరికల్ కామెంట్స్
- మాయ మాటలు చెప్పి నటించే ఓ డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్
- ఎంపీగా టికెట్ ఇవ్వమని చెప్తే ఎమ్మెల్యేగా పోటీకి వస్తుండు
- నాలుగున్నర ఏళ్లుగా అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో వస్తుండు
- ఓటుకు 20వేలు, సెల్ ఫోన్లు ఇస్తే తీసుకోండి
- కారు గుర్తుకు ఓటు వేయండి
- ఎంపీగా నాలుగున్నరేళ్లు ఏం చేశాడో బండి సంజయ్‌ను గ్రామాల్లో మహిళలు నిలదీయాలి.
- ఆనాడు తెలంగాణను అన్యాయంగా ఆంధ్రలో కలిపింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే
- యాభై ఏళ్ల దరిద్రం కావాలా.. పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కావాలా?
- కేసీఆర్‌కు మనమంతా అండగా ఉండాలి.
కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేటలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం
- ఉగ్యోగాలు లేక నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతోంది
- కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే
- కేసీఆర్ మనవడు హిమాన్షును ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి ఫైర్..
- కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుంది.
- కాంగ్రెస్ పార్టీవి ఫేక్ గ్యారంటీలు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తెలంగాణభవన్, గాంధీభవన్ దాటవు.
- బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపిస్తాం.
- నిశబ్ద విప్లవంలా ప్రజలు బీజేపీకి మద్దతు తెలపబోతున్నారు.
- అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం.
- కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన అందిస్తోంది.
- అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం.
- బీజేపీకి అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు.
- డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.
- తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మూలాలను బీఆర్ఎస్ దెబ్బతీసింది.
- ప్రతీనెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.

సీఎం కేసీఆర్ బస్సు తనిఖీ
- సీఎం కేసీఆర్ ప్రయాణించే బస్సును తనిఖీ చేసిన కేంద్ర బలగాలు
- కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రయాణం
- గుండపల్లి టోల్గేట్ వద్ద బస్సును నిలిపివేసి తనిఖీ చేసిన కేంద్ర బలగాలు.

ఎన్నికల వేళ ఓటర్ల సరికొత్త డిమాండ్
- వికారాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల కలకలం.
- పూడూరు మండలం కంకల్ గ్రామంలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు
- తమ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా మార్చాలంటూ ఫ్లెక్సీల ఏర్పాటు
- మండల కేంద్రంగా మార్చేందుకు హామీ ఇచ్చే పార్టీలే ఓట్లు అడిగేందుకు రావాలని డిమాండ్
- లేదంటే ఎవరికి ఓట్లు వెయ్యమంటున్న గ్రామస్థులు
- గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యువకులు
- దాదాపు 5వేల జనాభా, చుట్టూ 16 గ్రామాలు కలిగి ఉన్న కంకల్ గ్రామం
- గత మూడేళ్ళుగా మండల కేంద్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు, చుట్టూ ఉన్న గ్రామస్థులు
- మండల కేంద్రం ఏర్పాటు చేస్తామన్న వారికే తమ ఓట్లు అంటున్న గ్రామస్థులు

ఎన్నికలకు రెడీ అవుతున్న ఈసీ..
- తెలంగాణలో పోలింగ్, కౌంటింగ్‌కు సిద్ధమవుతున్న ఎలక్షన్ కమిషన్.
- 14లక్షల 40వేల బ్యాలెట్ పేపర్, 25వేల పోస్టల్ బ్యాలెట్స్ ముద్రణ
- ఈనెల 26 వరకు హోం ఓటింగ్, ఫెసిలిటేషన్ సెంట్రల్ ముగించాలని ప్రణాళికలు.
- కొత్త ఓటర్లు పెరగడంతో అదనంగా 299 పోలింగ్ కేంద్రాలు పెంపు.
- కౌంటింగ్ కేంద్రాలను సైతం పెంచిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.
నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం
- నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- నర్సాపూర్, పరకాల ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
- మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్‌లో బహిరంగసభ
- మధ్యాహ్నం మూడు గంటలకు పరకాల బహిరంగసభ
- సాయంత్రం ఆరు గంటలకు ఖైరతాబాద్‌లో రోడ్ షో
- రాత్రి ఎనిమిది గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
బ్యాంక్ ఆన్లైన్ బదిలీలపై ఈసీ నిఘా
- ఎన్నికల వేళ భారీ ఆన్లైన్ బ్యాంకు ట్రాన్స్ఫర్లపై నిఘా పెంచిన ఈసీ
- హైదరాబాద్‌లో రూ.8కోట్ల RTGS ద్వారా బదిలీని గుర్తించిన ఈసీ
- విశాఖ ఇండస్ట్రీస్ PVT HDFC బేగంపేట్ ఖాతా నుండి బదిలీ చేయబడిన రూ.8 కోట్లను స్థంబింపచేసిన సైఫాబాద్ పోలీసులు
- విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ IDBI బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్ ఖాతాకు నగదు బదిలీ అయినట్టు గుర్తింపు
- ఈనెల 13న ఉదయం 10.57 గంటలకు లావాదేవీ జరిగినట్లు గుర్తింపు
- ఐటీశాఖకు ఈడీకి భారీ మొత్తంలో లావాదేవీపై సమాచారం ఇచ్చిన పోలీసులు
- ఆయా కంపెనీలపై చట్టపరమైన చర్యలకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
నగదు తరలింపులో 10 మందికి నోటీసులు
- మోయినాబాద్ నగదు తరలింపు కేసులో 10మందికి 41ఏ నోటీసులు జారీ చేసిన పోలీసులు
- రూ.7.4కోట్లను సీజ్ చేసి, ఫోన్లను స్వాధీనం చేసుకున్న మోయినాబాద్ పోలీసులు
- మహేందర్‌కు చెందిన ఫామ్‌హౌజ్ నుంచి డబ్బులు బయటికి వచ్చినట్లు తేల్చిన పోలీసులు
- ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులకు చెందిన రెండు కార్లు సీజ్
- మహేందర్‌కు చెందిన ఫామ్‌హౌజ్, ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేసిన ఐటీ అధికారులు
- పలు కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు సేకరించిన ఐటీ అధికారులు
ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ
- బీజేపీ నేతలు ప్రచారంలో స్పీడ్ పెంచారు.
- తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
- నేడు జనగామ, కోరుట్ల బీజేపీ సభల్లో పాల్గొననున్న అమిత్ షా
- ఈరోజు సాయంత్రం ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో
- ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో పాల్గొననున్న నితిన్ గడ్కరీ
- జూబ్లీహిల్స్, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న నిర్మల సీతారామన్.
నేడు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన
- నేడు మానకొండూరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- తిమ్మాపూర్‌లోని శ్రీ చైత్యన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తి
- సభకు 50 వేల జన సమీకరణతో భారీ ఏర్పాట్లు.
నేడు ఆదిలాబాద్‌లో బండి సంజయ్ పర్యటన
- బీజేపీ నేత బండి సంజయ్ నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటన
- ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలో పాల్గొననున్న సంజయ్
- రాంలీలా మైదానం నుండి పంజాబ్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగనుంది.