తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

20 Nov, 2023 21:16 IST|Sakshi

Telangana Assembly Elections Today Minute To Minute  Update

మంథని కాంగ్రెస్‌లోకి చేరికలు

  • పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
  • ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో రామగిరి మండల ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, ముగ్గురు సర్పంచ్‌లు 
  • 500 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు

కరీంగనగర్‌లో బండి సంజయ్‌  ప్రచారం 

  • కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా
  • భూకబ్జాలు, లంచాలతో కోట్లు దండుకున్న గంగులా..
  • నువ్వా నా గురించి మాట్లాడేది
  • మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేని దద్దమ్మవి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నయీం బ్రదర్స్
  • ప్రజల కోసం జైలుకు పోయిన చరిత్ర నాది

ఉప్పల్‌లో కేటీఆర్ రోడ్ షో

  • మెట్రో రైల్‌ను ఈసీఐఎల్‌  వరకు పొడిగిస్తాం
  • నియోజకవర్గంలో కొన్ని కొన్ని సమస్యలున్నాయి
  • అవన్నీ పరిష్కరిస్తాం
  • ఉప్పల్ అభివృద్ది చేసేది కేవలం కేసీఆర్ మాత్రమే
  • ఎవరు ఎన్ని చెప్పినా డిసెంబర్ 3న మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

ఖైరతాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌ షో 

  • దానం నాగేందర్‌​ సగం హైదరాబాద్‌ ఆక్రమించుకున్నాడు
  • మూడుసార్లు ఎమ్మెల్యే అయి ఎంతమందికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పించాడు
  • చింతల రామచంద్రారెడ్డి పాత చింతకాయ పచ్చడి 
  • దానం, చింతల ఎలా మోసం చేశారో తెలుసు 
  • బస్తీలో ఇవాళ డబ్బులు ఇచ్చి తర్వాత గుంజుకుంటారు 
  • బస్తీల్లో పంచాయితీలు పోవాలి 
  • బీడీలు అమ్ముకునే దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్‌ కాదా 
  • కేసీఆర్‌ స్టేట్‌ను తాగుబోతుల తెలంగాణగా మార్చాడు

పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి : సీఈఓ వికాస్‌రాజ్‌

  • నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసింది.
  • పోలింగ్ అండ్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి
  • రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ స్లిప్ పంపిణి జరుగుతోంది
  • రెండు మూడు రోజుల్లో స్లిప్‌ల పంపినీ పూర్తవుతుంది
  • బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్‌ ప్రారంభం అయింది
  • రెగ్యులర్‌గా బ్యాలెట్ యూనిట్స్ 60వేలు వాడుతాం
  • హోం ఓటింగ్ ప్రారంభం అయింది

బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ చీఫ్‌ సోమా భరత్‌ కుమార్‌ 

రేవంత్‌, సునీల్‌ కనుగోలుపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం

  • సీఈఓకు నాలుగు ఫిర్యాదులిచ్చాం 
  • కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోంది
  • చట్టాన్ని, ఈసీని బేఖాతరు చేస్తోంది
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు
  • ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దురదృష్టవశాత్తూ ఈసీ చర్యలు తీసుకోలేదు
  • అందుకే ఆయన రెచ్చిపోతున్నారు. కేసీఆర్ శిరచ్చేధం చేయాలని రేవంత్ అంటున్నారు
  • తెలంగాణ సంస్కృతిని అవమానపరిచే భాష మాట్లాడుతున్నారు
  • ఎన్నికలంటే హింసను రెచ్చగొట్టడమేనా తొమ్మిదిన్నరేళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా
  • కాంగ్రెస్ చట్టాన్ని ఉల్లంఘించి అసత్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది
  • ఎలాంటి అనుమతులు లేకుండా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు
  • దొంగ ఛానళ్ల ముసుగులో దొంగ మనషులు బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారు
  • 28 ఛానళ్ల వివరాలు ఈసీకి ఇచ్చాం. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాం
  • తెరవెనుక ఉండి సునీల్ కనుగోలు లాంటి వాళ్లు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు
  • సునీల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాం
  • రేవంత్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రచారానికి దూరం పెట్టాలని కోరాం
  • స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డిని తొలగించాలని కోరాం
  • క్యూన్యూస్ లో కాంగ్రెస్‌కు నేరుగా ప్రచారం చేస్తున్నారు
  • చర్యలు తీసుకోవాలని కోరాం
  • స్టడీ ఐక్యూ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోంది
  • చర్యలు తీసుకోవాలని కోరాం

ఎంపీ లక్ష్మణ్‌ ప్రెస్‌ మీట్‌ 

  • బీజేపీ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనేది సుపరిపాలన కోసమే
  • బీజేపీ మానిఫెస్టో ప్రజల మేనిఫెస్టో మిగిలిన పార్టీలవి రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభ సృష్టించేవి
  • అప్పు చేసి పప్పు కూడు తినడం ప్రణాళిక కాదు
  • ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు
  • బతుకును మార్చే మానిఫెస్టో ఇవ్వడంలో మిగిలిన పార్టీలు విఫలం అయ్యాయి
  • కర్ణాటక, హిమాచల్‌లో ఇచ్చిన గ్యారంటీల వారంటీ పోయి ప్రజలు తిరగబడ్డారు
  • సంక్షేమం ప్రజలకు అందేలా ప్రణాళిక వేశాం 
  • కాంగ్రెస్,బీఆర్‌ఎస్‌ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారు

మిర్యాలగూడ రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్

  • తెలంగాణ రాకముందు ఎలా ఉంది
  • వచ్చిన తర్వాత ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాలి
  • కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు పడ్డాం
  • ఇన్వర్టర్, జనరేటర్ పై ఆధారపడ్డారు
  • రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కరెంట్ కనిపించడం లేదంట
  • కాంగ్రెస్ వాళ్లకి కరెంట్ గురించి మాట్లాడే అర్హత లేదు
  • 55 ఏళ్లు దేశాన్ని పాలించిన సన్నాసులు..కాంగ్రెస్ వాళ్లు
  • ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు
  • రైతు బంధు లాంటి పథకాలు కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపేట్ట లేదు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా ఖర్చు అంటున్నారు
  • రైతు బంధు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయండి

నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ కామెంట్స్‌ 

  • ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు 
  • అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను గమనించాలి
  • పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి
  • కరెంట్‌, నీటి కష్టాలు తీర్చుకున్నాం  
  • కాంగ్రెస్‌కు చాన్సిస్తే మళ్లీ ఆగమాగమే
  • కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణ 50 ఏళ్లు గోసపడింది
  • నల్గొండకు ఐటీ టవర్‌ కూడా వచ్చేసింది 
  • మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు ప్రచారం చేస్తారు
  • తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్‌
  • కోమటిరెడ్డి టైమ్‌లో నల్గొండ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది 
  • బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం 
  • కాంగ్రెస్‌ పాలనలో మంచినీళ్లు, కరెంట్‌ కూడా ఇవ్వలేదు
  • కాంగ్రెస్‌ వాళ్లు ధరణి తీసేస్తామంటున్నరు 
  • రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడు

మూడు రోజులు తెలంగాణలోనే ప్రధాని మోదీ  

  • 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్న ప్రధాని మోదీ
  • మూడు రోజుల్లో అరు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని
  • 22న పవన్‌కళ్యాణ్‌ వరంగల్ బహిరంగ సభ
  • 26న అమిత్ షా తో కలిసి జనసేన అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ సభలో పాల్గొంటారు

 గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ రోడ్ షోలో హరీశ్ రావు కామెంట్స్

  •  నాడు ఇక్కడ చుక్క నీళ్ళు లేని పరిస్థితి
  •  ఇప్పుడు ఎండాకాలంలో మంచినీళ్లు ఇచ్చింది కేసీఆర్
  •  60 ఏళ్ల పాటు ఎంతోమంది మారారు కానీ మంచినీళ్ల సమస్య తీర్చింది కేసీఆర్‌
  • రూ. 2వేల పింఛన్‌ ఇచ్చి ముసలవ్వలను, తాతలను ఆదుకుంటున్నది కేసీఆరే
  •  బీడీ కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు.. ధైర్యంగా బతుకుతున్నారు 
  • ఈసారి కారుని గెలిపిస్తే 5 వేల పింఛన్ చేస్తా అని కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు
  • కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక గురి 
  • చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్
  • కాంగ్రెస్సోడు సీఎం నేనంటే నేనని తన్నుకుంటున్నడు
  • బీజేపీ వాడు సిలిండర్‌  వెయ్యి చేసిండు
  • బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు చెప్పుకునే ముఖం లేదు
  • అందుకే అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • కారు గుర్తుకు ఓటు వేసి, కేసీఆర్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా

బాల్కసుమన్‌, జగదీష్‌రెడ్డిలపై సీఈవోకు  ఓయూ జేఏసీ ఫిర్యాదు 

  • చెన్నూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్ 
  • సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగదీష్ రెడ్డిపై ఫిర్యాధు చేసిన నాయకులు
  • ఆనాడు బాల్క సుమన్ గెలుపు కోసం ప్రచారం చేశాం
  • ఇప్పుడు చెన్నూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు
  • సూర్యాపేటలో పోలీసులు జగదీష్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు 

కోరుట్ల సభలో అమిత్‌ షా కామెంట్స్‌ 

  • ఈసారి తెలంగాణలో మూడుసార్లు దీపావళి
  • డిసెంబర్‌ 3న బీజేపీ పవర్‌లోకి వచ్చాక మూడవ దీపావళి
  • జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి
  • బీజేపీ పవర్‌లోకి వస్తే ఉచితంగా అయోధ్య దర్శనం 
  • ప్రధాని పసుపు బోర్డు ప్రకటించారు 
  • మూడు షుగర్‌ ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బీసీలను మోసం చేశాయి
  • నిజామాబాద్‌లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం

స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ కామెంట్స్‌

  • అబద్ధాలు ప్రచారం చేస్తారు 
  • ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి 
  • ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు
  • పదేళ్లపాలనలో జరిగిన అభివృద్ధి చూడండి
  • నీటి, కరెంట్‌ కష్టాలు తీర్చుకున్నాం
  • పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు
  • కాంగ్రెస్‌కు ఛాన్సిస్తే మళ్లీ ఆగమాగమే
  • బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణప్రజల కోసం
  • 15 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం
  • మిషన్‌ భగీరథతో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం
  • ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌
  • అధికారంలో ఉన్నపుడు ఏం చేయకుండా మళ్లీ చాన్సివ్వమంటున్నారు
  • ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి 
  • ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే కదా 
  • ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లే కదా 
  • రైతుబంధు ఉండాలా వద్దా 
  • రైతుబంధు రూ.16 వేలు చేస్తాం
  • ధరణిని కాంగ్రెస్‌ నేతలు బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు 
  • ధరణి ప్లేస్‌లో భూ  మాత తీసుకొస్తామంటున్నారు
  • కాంగ్రెస్‌ది భూ మాత కాదు భూ మేత

వేములవాడ బీఎస్పీ బహిరంగ సభలో అపశృతి 

  • టెంట్ కూలి పలువురి గాయాలు
  •  ఆస్పత్రికి తరలింపు 
  • ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కొద్ది నిమిషాల్లో ప్రసంగించాల్సి ఉండగా ఘటన

జనగామ సభలో అమిత్‌ షా కామెంట్స్‌

  • కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ అవినీతిపరుడు 
  • అవినీతిపరులు అందరినీ జైలుకు పంపుతం
  • 4 శాతం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం 
  • పవర్‌లోకి రాగానే స్కామ్‌లపై దర్యాప్తు చేస్తాం 

ఆటో డ్రైవర్లకు కొత్త పథకం ప్రకటించిన కేసీఆర్‌

  • మానకొండూరులో సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభ
  • ఆటో డ్రైవర్లకు కొత్త పథకం ప్రకటించిన కేసీఆర్‌
  • బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ప్యాసింజర్‌ ఆటోలకు ఫిట్‌నెస్‌, పర్మిట్‌ రద్దు చేస్తాం.
  • ఫిట్‌నెస్‌ ఫీజు రూ. 700,  పర్మిషన్‌ ఫీజు 500రద్దు

ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించిన కేసీఆర్‌

  • ఇందరిమ్మ రాజ్యంలో ఎంత సక్కదనం ఉండేదో మాకు తెలుసు.
  • ఎమర్జెన్సీ పెట్టి అమాయకులను జైల్లో వేశారు
  • ఇందిరమ్మ పాలన బాగుంటే వలసలు ఎందుకు జరిగాయి.
  • ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టారు.
  • ఇందిరమ్మ పాలన సరిగా లేనందునే ఎన్టీఆర్‌ రూ. 2 కిలో బియ్యం పథకం తెచ్చారు.
  • 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరూ
  • 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి మాతో పొత్తుపెట్టుకున్నారు
  • అభ్యర్థులనే కాదు.. వాళ్ల పార్టీ చరిత్రను కూడా గుర్తుపెట్టుకొని ఓటు వేయాలి.
  • ఓటు మీ తలరాతను మారుస్తుంది. 
  • ఆలోచించి ఓటు వేయకపోతే ఓటే మిమ్మల్ని కాటేస్తుంది.
  • పెన్షన్లను రూ.5వేల వరకు పెంచుతాం.

బీఆర్‌ఎస్‌ కొత్త సినిమాను ప్రజలు నమ్మరు: రేణుకా చౌదరి

  • ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి
  • రేణుకా చౌదరి కామెంట్స్‌..
  • రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది
  • ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు అడ్డు పడ్డా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్ గెలుస్తాం
  • ఆరు గ్యారంటీ లు ప్రజల్లోకి వెళ్లాయి..
  • ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు.
  • 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హాక్కు కల్పించింది రాజీవ్ గాంధీ.
  • బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరు.
  • ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రజలు తగిన బుద్ది చెబుతారు.
  • ఓట్లకు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
  • తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.
  • మైనారిటీలు కాంగ్రెస్ వెంట ఉన్నారు.
  • ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారు.
  • మహ్మద్ అజురుద్దీన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. 
  • కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో కడుతుండంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కూలిపోతున్నాయి
  • మా హయంలో లక్షలాది మంది ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించాం.
  • చంద్రబాబుకు గతంలో మేము సహకరించాం.. ఇప్పుడు ఆయన మాకు సపోర్టు ఇస్తున్నారు.
  • కేటీఆర్ ఐటీ కింగ్ అంటారు. కానీ, జాబ్స్‌ మాత్రం ఇవ్వరు.
  • సీఎం పదవిని చాలా మంది ఆశిస్తారు. అది గెలిచ వచ్చిన వారి హాక్కు 
  • ఈ విషయంలో హై కమాండ్ నిర్ణయం ఫైనల్‌.
  • కర్ణాటకలో డీకే శివ కుమార్‌ను సీఎం అనుకున్నారు.. కానీ, సిద్ద రామయ్య సీఎం అయ్యారు
  • ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత సీట్లు కాంగ్రెస్‌కి వస్తాయి. 

నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే..

  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కీలక వ్యాఖ్యలు
  • నాకు ప్రాణహాని ఉంది
  • కాంగ్రెస్ గూండాల నుండి రక్షణ కల్పించాలి
  • పోలీసుల తీరు చాలా బాధాకరం.
  • నాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వీడియోలు తీస్తున్నారు
  • బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం
  • నీలోజిపల్లి గ్రామంలో నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారు.
  • ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
  • బీఆర్ఎస్ నాయకుడు నాగి శేఖర్‌ను కూడా నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు వెంటాడారు.
  • ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
  • బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ Vs బీఆర్‌ఎస్‌

  • చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు. 
  • రెండు పార్టీల నాయకుల మధ్య తోపులాట. 
  • కాంగ్రెస్‌ నాయకులు చంపడానికి వచ్చారని రవి శంకర్‌ ఆరోపణ. 
  • కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు. 

న్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ

  • నేడు మరోసారి తెలంగాణలో పర్యటించనున్న కేంద్రమంత్రి అమిత్‌షా.
  • జనగామ, కోరుట్లలో పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొననున్న అమిత్‌ షా.
  • జూబ్లీహిల్స్‌, మల్కాజిగిరి ప్రచారంలో పాల్గొననున్న నిర్మలా సీతారామన్‌.

తెలంగాణలో మొదలైన హోం ఓటింగ్‌

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదలైన హోం ఓటింగ్‌
  • ఇళ్లకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగుల ఓటింగ్‌ సేకరిస్తున్న ఎన్నికల సిబ్బంది
  • దివ్యాంగులు, వయోవృద్ధులకు హోం హోటింగ్‌ వేయిస్తున్న ఎన్నికల సిబ్బంది
  • దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు అవకాశం కల్పించిన ఈసీ

బండి సంజయ్‌పై గంగుల సెటైర్లు..

  • కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్, ఎలబోతారంలో ఎన్నికల ప్రచారంలో గంగుల కమలాకర్‌
  • ప్రచారంలో బండి సంజయ్‌పై సెటైరికల్ కామెంట్స్ 
  • మాయ మాటలు చెప్పి నటించే ఓ డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్
  • ఎంపీగా టికెట్ ఇవ్వమని చెప్తే ఎమ్మెల్యేగా పోటీకి వస్తుండు
  • నాలుగున్నర ఏళ్లుగా అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో వస్తుండు
  • ఓటుకు 20వేలు, సెల్ ఫోన్లు ఇస్తే తీసుకోండి
  • కారు గుర్తుకు ఓటు వేయండి
  • ఎంపీగా నాలుగున్నరేళ్లు ఏం చేశాడో బండి సంజయ్‌ను గ్రామాల్లో మహిళలు నిలదీయాలి.
  • ఆనాడు తెలంగాణను అన్యాయంగా ఆంధ్రలో కలిపింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే
  • యాభై ఏళ్ల దరిద్రం కావాలా.. పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కావాలా?
  • కేసీఆర్‌కు మనమంతా అండగా ఉండాలి. 
     

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేటలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం

  • ఉగ్యోగాలు లేక నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతోంది
  • కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ పదవులే
  • కేసీఆర్‌ మనవడు హిమాన్షును ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు

కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌..

  • కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుంది. 
  • కాంగ్రెస్‌ పార్టీవి ఫేక్‌ గ్యారంటీలు
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు తెలంగాణభవన్‌, గాంధీభవన్‌ దాటవు. 
  • బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీతో విచారణ జరిపిస్తాం. 
  • నిశబ్ద విప్లవంలా ప్రజలు బీజేపీకి మద్దతు తెలపబోతున్నారు. 
  • అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. 
  • కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి పాలన అందిస్తోంది. 
  • అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. 
  • బీజేపీకి అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. 
  • డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ద్వారా రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. 
  • తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మూలాలను బీఆర్‌ఎస్‌ దెబ్బతీసింది. 
  • ప్రతీనెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో​ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంది. 

సీఎం కేసీఆర్‌ బస్సు తనిఖీ

  • సీఎం కేసీఆర్‌ ప్రయాణించే బస్సును తనిఖీ చేసిన కేంద్ర బలగాలు
  • కరీంనగర్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ ప్రయాణం
  • గుండపల్లి టోల్‌గేట్‌ వద్ద బస్సును నిలిపివేసి తనిఖీ చేసిన కేంద్ర బలగాలు.

ఎన్నికల వేళ ఓటర్ల సరికొత్త డిమాండ్‌

  • వికారాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల కలకలం.
  • పూడూరు మండలం కంకల్ గ్రామంలో  కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు
  • తమ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా మార్చాలంటూ ఫ్లెక్సీల ఏర్పాటు
  • మండల కేంద్రంగా మార్చేందుకు హామీ ఇచ్చే పార్టీలే ఓట్లు అడిగేందుకు రావాలని డిమాండ్
  • లేదంటే ఎవరికి ఓట్లు వెయ్యమంటున్న గ్రామస్థులు
  • గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యువకులు
  • దాదాపు 5వేల  జనాభా, చుట్టూ 16 గ్రామాలు కలిగి ఉన్న కంకల్ గ్రామం
  • గత మూడేళ్ళుగా మండల కేంద్రం ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు, చుట్టూ ఉన్న గ్రామస్థులు
  • మండల కేంద్రం ఏర్పాటు చేస్తామన్న వారికే తమ ఓట్లు అంటున్న గ్రామస్థులు

ఎన్నికలకు రెడీ అవుతున్న ఈసీ..

  • తెలంగాణలో పోలింగ్‌, కౌంటింగ్‌కు సిద్ధమవుతున్న ఎలక్షన్‌ కమిషన్‌. 
  • 14లక్షల 40వేల బ్యాలెట్‌ పేపర్‌, 25వేల పోస్టల్‌ బ్యాలెట్స్‌ ముద్రణ
  • ఈనెల 26 వరకు హోం ఓటింగ్‌, ఫెసిలిటేషన్‌ సెంట్రల్‌ ముగించాలని ప్రణాళికలు. 
  • కొత్త ఓటర్లు పెరగడంతో అదనంగా 299 పోలింగ్‌ కేంద్రాలు పెంపు. 
  • కౌంటింగ్‌ కేంద్రాలను సైతం పెంచిన సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌.

నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్‌ ప్రచారం

  • నేడు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • నర్సాపూర్, పరకాల ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.
  • మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్‌లో బహిరంగసభ
  • మధ్యాహ్నం మూడు గంటలకు పరకాల బహిరంగసభ
  • సాయంత్రం ఆరు గంటలకు ఖైరతాబాద్‌లో రోడ్ షో
  • రాత్రి ఎనిమిది గంటలకు నాంపల్లి రోడ్ షోలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.

బ్యాంక్‌ ఆన్‌లైన్‌ బదిలీలపై ఈసీ నిఘా

  • ఎన్నికల వేళ భారీ ఆన్‌లైన్‌ బ్యాంకు ట్రాన్స్‌ఫర్లపై నిఘా పెంచిన ఈసీ
  • హైదరాబాద్‌లో రూ.8కోట్ల RTGS ద్వారా బదిలీని గుర్తించిన ఈసీ
  • విశాఖ ఇండస్ట్రీస్ PVT HDFC బేగంపేట్ ఖాతా నుండి బదిలీ చేయబడిన రూ.8 కోట్లను స్థంబింపచేసిన సైఫాబాద్ పోలీసులు 
  • విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ IDBI బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్ ఖాతాకు నగదు బదిలీ అయినట్టు గుర్తింపు
  • ఈనెల 13న ఉదయం 10.57 గంటలకు లావాదేవీ జరిగినట్లు గుర్తింపు
  • ఐటీశాఖకు ఈడీకి భారీ మొత్తంలో లావాదేవీపై సమాచారం ఇచ్చిన పోలీసులు
  • ఆయా కంపెనీలపై చట్టపరమైన చర్యలకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

నగదు తరలింపులో 10 మందికి నోటీసులు

  • మోయినాబాద్ నగదు తరలింపు కేసులో 10మందికి 41ఏ నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • రూ.7.4కోట్లను సీజ్ చేసి, ఫోన్లను స్వాధీనం చేసుకున్న మోయినాబాద్‌ పోలీసులు
  • మహేందర్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌ నుంచి డబ్బులు బయటికి వచ్చినట్లు తేల్చిన పోలీసులు
  • ఖమ్మంకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువులకు చెందిన రెండు కార్లు సీజ్ 
  • మహేందర్‌కు చెందిన ఫామ్‌హౌజ్, ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేసిన ఐటీ అధికారులు
  • పలు కీలక పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు సేకరించిన ఐటీ అధికారులు

 
ప్రచారంలో స్పీడ్‌ పెంచిన బీజేపీ

  • బీజేపీ నేతలు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. 
  • తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 
  • నేడు జనగామ, కోరుట్ల బీజేపీ సభల్లో పాల్గొననున్న అమిత్ షా
  • ఈరోజు సాయంత్రం ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో 
  • ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో పాల్గొననున్న నితిన్‌ గడ్కరీ
  • జూబ్లీహిల్స్, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న నిర్మల సీతారామన్.


నేడు కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

  • నేడు మానకొండూరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
  • తిమ్మాపూర్‌లోని  శ్రీ చైత్యన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తి
  • సభకు 50 వేల జన సమీకరణతో భారీ ఏర్పాట్లు.


నేడు ఆదిలాబాద్‌లో బండి సంజయ్‌ పర్యటన

  • బీజేపీ నేత బండి సంజయ్‌ నేడు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటన
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షోలో  పాల్గొననున్న సంజయ్‌
  • రాంలీలా మైదానం నుండి పంజాబ్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగనుంది. 
మరిన్ని వార్తలు