టీఆర్‌ఎస్‌ ఎన్నికల రాజకీయం చేస్తోంది: దాసోజు

18 Nov, 2020 19:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగడంతో రాజకీయ పార్టలో హాడావుడి మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రముఖ పార్టీ నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటే ఆయా పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీలోనే ఉండాలా లేక ఇతర పార్టీలో చేరాలా అనే అయోయంలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ భరిలో దిగే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మాజీ ఎంపీ అంజన్‌ కమార్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షితో సమావేశమ్యారు. ఈ సందర్భంగా అంజన్‌ కుమార్‌ మాట్లాడుతూ... తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ అవన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ వేసే ముందు తనను సంప్రదించలేదని కొంత అసంతృప్తితో ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని, ఒక సీటు గెలిచిన బీజేపీ, హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, సోనియాగాంధీని మోసం చేసి వెళ్లను అన్నారు. (చదవండి: ‘గ్రేటర్‌’ ఎన్నికలు; కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదే)

అలాగే కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌లో వేలాది మంది ప్రజలు మీసేవ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పదివేల కోసం తిండి, తిప్పలు మాని రాత్రి, పగలు తేడా లేకుండా లైన్‌ల్లో నిలబడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల ప్రజలు చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో డబ్బులు వేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ పని చేయడం లేదని, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. పేదలను బలిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ప్రజల వివరాలు సేకరించి డబ్బులు వేయవచ్చు కదా అని ధ్వజమెత్తారు. ప్రతీ బాధితుడిని ఆదుకోవాలని సూచించినా.. అధికార పార్టీ వినకుండా ఎన్నికల రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎంత వరద నష్టం జరిగిందనే దానిపై సమగ్ర సమాచారం గుర్తించారా అని, ఈ విషయంలో గవర్నర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని విమర్శించారు. వరద అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని, వరద సహాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని దాసోజు వ్యాఖ్యానించారు. (చదవండి: తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు)

అదే విధంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ‘అధికార పార్టీ టీఆర్‌ఎస్‌​ గ్రాఫ్ పడిపోతున్నందున ఎవరికి టైం ఇవ్వకుండా ఎన్నికలు పెట్టేశారు. తమ పార్టీ నాయకులు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్‌ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆయన పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే.. కాంగ్రెస్ ఉండాలి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంది. పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రేపు 9 గంటలకు శేరిలింగంపల్లిలో సమావేశం నిర్వహిస్తున్నాం. శేరిలింగంపల్లిలో పది డివిజన్‌లలో కాంగ్రెస్ గెలుపుకు రేపటి మీటింగ్ ఉపయోగపడుతుంది. బీజేపీ అంత గట్టిగా ఉంటే.. మా పార్టీ నేతల వెంట ఎందుకు పడుతున్నారు. బీజేపీకి సరుకు లేక.. మా పార్టీ నేతల వెంటపడుతోంది. హైదరాబాద్ వరదలు వస్తే.. ఒక్క రూపాయి సహాయం చేయలేదు.  2009 కంటే మెరుగైన ఫలితాలు ఈ సారి సాధిస్తాం’ అని కొండా ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు