జస్ట్‌ మిస్‌.. కొద్దిలో గట్టెక్కింది వీరే.. భారీ మెజార్టీ వీళ్లదే..

4 Dec, 2023 09:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి ‍ప్రమాణ స్వీకారానికి ప్లాన్‌ జరుగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్‌తో, భారీ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. 

బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది వీరే.. 
చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్‌ఎస్‌) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు.
యాకుత్‌పురలో జాఫర్‌ హుస్సేన్‌ (ఎంఐఎం) 878 ఓట్లు,
జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్‌) 1,152,
దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్‌) 1,392,
నాంపల్లిలో మాజిద్‌ హుస్సేన్‌ (ఎంఐఎం) 2,037,
బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్‌) 3,062,
సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088,
కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌) 3,163,
బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) 4,533,
సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) 4,606,
ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్‌) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు.

20 మందికి 50వేలకుపైగా మెజారిటీ 
రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్‌ (బీఆర్‌ఎస్‌) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు.
సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్‌ఎస్‌) 82,308,
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం) 81,660,
కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్‌ఎస్‌) 70,387,
నకిరేకల్‌ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్‌) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్‌ నుంచి 13 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు