Shivraj Singh: పెళ్లి వద్దన్న శివరాజ్‌.. చివరికి ఎందుకు అంగీకరించారు?

4 Dec, 2023 09:26 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ చురుకైన రాజకీయవేత్తగా పేరు పొందారు. 2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో మరోసారి రుజువు చేశారు. శివరాజ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంది. శివరాజ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ అమోఘ విజయాన్ని నమోదు చేసుకుంది. గతంలో అంటే 2013లో శివరాజ్ నేతృత్వంలో బీజేపీ 165 సీట్లు గెలుచుకుంది. అయితే 2003లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాడు ఉమాభారతి నేతృత్వంలో పార్టీ 230 స్థానాలకు గాను 173 స్థానాలను గెలుచుకుంది.

శివరాజ్ సింగ్ వ్యక్తిగత విషయాలు అప్పుడప్పుడు తళుక్కుమంటుంటాయి. ‘మామ’ పేరుతో ప్రసిద్ధి చెందిన శివరాజ్ సింగ్ తొలుత తన జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు. రైతు కుటుంబం నుండి వచ్చిన శివరాజ్ తన యుక్తవయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరాడు. సంస్థలో చేరిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు అనుగుణంగా ఉండాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు.

అయితే శివరాజ్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. శివరాజ్ 1991లో విదిశ సీటును గెలుచుకోవడం ద్వారా తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు  అతనిని పెళ్లి చేకోవాలంటూ మరింతగా ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు తన సోదరి ఒప్పించిన మీదట శివరాజ్ సింగ్.. సాధన సింగ్‌ను కలుసుకున్నారు. ఆమెను చూసిన వెంటనే శివరాజ్ తన మనసు మార్చుకుని, సాధనతో పెళ్లికి అంగీకరించారు. సాధనకు కూడా శివరాజ్ సింగ్ సింప్లిసిటీ ఎంతగానో నచ్చింది. ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పారు. 

అయితే శివరాజ్‌ సింగ్‌ ..సాధనకు తన రాజకీయ లక్ష్యాల గురించి తెలియజేశారు. తనను వివాహం చేసుకుంటే తక్కువ సమయం కేటాయించగలుగుతానని వివరించారు. శివరాజ్‌ మాటతీరు, వ్యవహారశైలి నచ్చిన సాధన అతనితో కలసి నడిచేందుకు సమ్మతించారు. తరువాత వారిద్దరు తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకుంటూ లేఖలు రాసుకునేవారు. ఈ నేపధ్యంలోనే వారికి వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమారులు. 
ఇది కూడా చదవండి: భార్యను ఓడించిన భర్త.. అన్నను మట్టికరిపించిన చెల్లి!

>
మరిన్ని వార్తలు