ఎంత ‘ఓటు’ ప్రేమయో..! 

16 Nov, 2023 10:59 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈ విషయం పోటీ చేసే రాజకీయ నాయకులకు బాగా తెలుసు. ఎన్నికలకు ముందు వరకు ఎవరూ గుర్తు లేనట్టు నటించే నేతలకు.. ఇప్పుడు అవసరార్థం ప్రతీ వ్యక్తి గుర్తొస్తున్నారు. గుంపులో గోవింద మాదిరిగా కాకుండా కనిపించిన ప్రతి వ్యక్తిని ఓటు అడుగుతున్నారు. వ్యక్తులే కాదు.. ఇప్పుడు కుల సంఘాలు, యువజన సంఘాలంటే వల్లమాలిన అభిమానం కురుపిస్తున్నారు.

వాళ్ల దగ్గరకు చేరుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక మహిళా సంఘాలైతే మరీను.. రాజకీయ నేతలు ఉదయం అంతా ప్రచారంలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. రాత్రి వేళల్లో లేదా తమకు ముఖ్య అనుచరులకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నారట. వలస ఓటర్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టారట. ఏకంగా వలస ఓటర్ల కోసం స్థానిక నేతలతో వాకబు చేస్తూ.. వారిని పోలింగ్‌ రప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారట. 

మరిన్ని వార్తలు