నాడు నోటుకు ఓటు..నేడు నోట్లకు సీట్లు 

17 Oct, 2023 01:54 IST|Sakshi

టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్‌ నేతలు: మంత్రి హరీశ్‌రావు ధ్వజం

సాక్షి, సిద్దిపేట: ‘టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నాడు నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి అయితే.. నేడు కాంగ్రెస్‌ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్‌లో మాట్లాడుతున్నారు’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారని ఆరోపించారు. సిద్దిపేటలో మంగళవారం సీఎం సభ జరగనున్న సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన, బీఫారాల అందజేత, ప్రచారంలో ముందున్నాం రేపు సీట్లు గెలుపొందడంలో కూడా ముందే ఉంటామన్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని, ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో వారు ఉన్నారని తెలిపారు.

తమ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు.. కానీ కాంగ్రెస్‌ పార్టీయే తమ పథకాలను కాపీ కొట్టిందని హరీశ్‌ ఆరోపించారు. రైతు బంధు, పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని గుర్తు చేశారు.  బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరని మంత్రి ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్‌ చదువుతుండటంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నవ్వుల పాలవుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు