వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి

10 Nov, 2023 05:50 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం క్షేమంగా ఉంటుంది 

తెలంగాణను ఆయన ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారు 

సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి   

సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్‌ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్‌ వేశారు. అంతకుముందు హరీశ్‌రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

నామినేషన్‌ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్‌ ఔట్‌ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్‌ వేశానని చెప్పారు.

మరిన్ని వార్తలు