గెలిపిస్తేనే వస్తా.. లేకుంటే మళ్లీ ఇక్కడికి రాను: కేటీఆర్‌

6 Nov, 2023 15:00 IST|Sakshi

సాక్షి, వేములవాడ: ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే మళ్లీ వేములవాడ వస్తానని, లేదంటే ఇక్కడికి రానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అ‍న్నారు. గెలిపిస్తే  నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. సోమవారం వేములవాడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్‌ ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కేసీఆర్‌ ఎంత ఉంటడు గింతంత ఉంటడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి. గిట్ల అ‍న్నందుకు కేసు పెడితే బోయినపల్లి  వినోద్‌ కుమార్‌పై పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌  మధ్యే. 

కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్‌ మన నెత్తిన పాలుపోసి పోయిండు. అక్కడ 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్సోళ్లు అతన్ని  మళ్లీ ప్రచారానికి  పిలవట్లేదు. రాహుల్‌ గాంధీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అవును ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతు​న్న యుద్ధమే. డిసెంబర్‌3న చూద్దాం ఎవరు గెలుస్తరో.  ఢిల్లీ, గుజరాత్‌ నుంచి వచ్చిన వాళ్లతో ఏమీ కాదు. తెలంగాణ భవిష్యత్‌ ఇక్కడి గల్లీలోనే డిసైడ్‌ కావాలె. కేసీఆర్‌ అంటే తెలంగాణ భరోసా. సెంటిమెంట్‌లకు ఆయింట్‌ మెంట్‌లకు లొంగవద్దు. రేవంత్‌ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు’ అని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు