ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్‌.. ఏమన్నారంటే?

3 Dec, 2023 15:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు లీడ్‌లోనే దూసుకెళ్లారు. ఇక, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్‌ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఓటమిపై కేటీఆర్‌ స్పందించారు. 

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందాను. రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను ఒక అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. సిరిసిల్లలో కేటీఆర​ విజయం సాధించారు. దాదాపు 29వేల మెజార్టీతో కేటీఆర్‌ విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్‌ 2018 ఎన్నికల్లో దాదాపు 89వేల మెజార్టీలో గెలుపొందారు. ఇక, ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్వల్పంగా రావడం కూడా కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణులను నిరాశ పరచినట్టు తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు