ఆ శాపమే కాంగ్రెస్‌ను ముంచేసింది: కాంగ్రెస్‌ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

3 Dec, 2023 15:26 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్‌  ప్రకారం బీజీపీ  ఆధిక్యం కొనసాగుతోంది. మూడు  రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌  వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో  ఆ పార్టీ ఎంపీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ సలహాదారు  ఆచార్య ప్రమోద్ కృష్ణం కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన్ (ధర్మం)ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ పార్టీని ముంచేసిందన్నారు. గతంలో మహాత్మా గాంధీ బోధనలకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి మద్దతివ్వడం,  సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే శాపమంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కాంగ్రెస్‌ పార్టీ ఓటమి కాదు. కూల్చివేస్తామని ప్రకటించిన వారికి (కమ్యూనిస్టులు) కాంగ్రెస్ మద్దతిస్తోంది.  సెక్యులరిస్ట్‌  మహాత్మా గాంధీని అనుకరించే  కాంగ్రెస్‌ పార్టీ,  సనాతన్ (ధర్మం)ని వ్యతిరేకించడం శాపం అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక మనస్తత్వం ఫలితమే  ఇదని  ప్రమోద్‌ కృష్ణ పేర్కొన్నారు. కాంగ్రెస్ మతాన్ని అగౌరవపరిచింది.  సనాతన్ శాపం కారణంగా తాము ఓడిపోయాం అంటూ ట్వీట్‌లో ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు.  భావాన్ని తెలియజేశాడు.  

రాజస్థాన్‌అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్‌  దాటేసిన  బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటూ బీజేపీ సంబరాలు  చేసుకుటోంది. దీంతో దశాబ్దాలుగా కొసాగుతున్న ట్రెండ్‌ ఈసారి కూడా రిపీట్‌ అయ్యింది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని బీజేపీకి ప్రజలు కట్టినట్టు కనిపిస్తోంది. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించి వసుంధర రాజే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలోకి నెట్టింది. అశోక్ గెహ్లోత్‌ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్‌ను  ఓడించి, అధికారాన్ని తిరిగి  చేజిక్కించు కోవాలని  బీజేపీ చూస్తోంది. 

వసుంధరా రాజే, దియా కుమారి భారీ విజయం
బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి  వసుంధర రాజే ఝల్రాపటన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో  గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో తమ నేతమళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని  ఆమె విధేయులు కోరుకుంటున్నారు. బీజేపీ ఎంపీ  దియా కుమారి విద్యాధర్ నగర్‌లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారికూడా సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే.  తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె  దేశవ్యాప్తంగా మోదీ సునామీ  వస్తోందని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు