కార్యకర్తలు కాలర్‌ ఎగరేసేలా సీఎం జగన్‌ పాలన

10 Oct, 2023 05:16 IST|Sakshi

ఏపీకి మళ్లీ జగనే సీఎం ఎందుకు కావాలో వివరిద్దాం

నాలుగు ప్రధాన కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోకి వెళ్దాం

వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో మాజీ మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి నాయకత్వంలో పనిచే­యడం ప్రతి కార్యకర్త గొప్ప అదృష్టంగా భావిస్తు­న్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు జగనే మళ్లీ ఎందుకు సీఎం కావాలనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చె­­ప్పారు.

భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వం నిరంతరం ప్ర­జ­ల్లోనే పని చేసేలా రూపొందించిన నాలుగు ప్రధాన కార్యక్ర­మా­లను సోమ­వా­రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్న­బాబు మాట్లాడుతూ.. ‘జగనన్న ఆరోగ్య సురక్ష, ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. జగనే మళ్లీ ఎందుకు రావాలంటే,  బస్సు యాత్ర, ఆడు­దాం ఆంధ్ర’ కార్యక్రమాల ద్వారా ప్రజా బాహు­ళ్యం­లోకి వెళ్లాలన్నారు.

ప్రతి కార్యకర్తా ఓ సైని­కు­డిగా సీఎం జగన్‌ ప్రజలకు చేసిన మంచిని వివరించాలని కోరారు. అంతకు ముందు పలువురు ప్రజా ప్రతినిధులు మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను గెలిపించుకునే ఆవశ్యకతపై ప్రసంగించారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే.. 


జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలి 
కుల, మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు కూటములు కడుతుంటే.. సీఎం జగన్‌ ఒంటరిగానే పేదలకు మేలు చేస్తున్నారు. గత ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఇప్పుడు నెలకు రూ.2 వేల కోట్లు. ఇంత మంచి చేస్తున్న జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలని గ్రామాల్లోని అవ్వతాతలకు, అక్క చెల్లెమ్మలకు చెప్పాలి.
– మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ 

సంక్షేమ రాజ్యానికి ఏపీ ప్రతీక 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో సంక్షేమ రాజ్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రతీకగా నిలుస్తోంది. పేదల అభ్యున్నతే లక్ష్యంగా వాడవాడలా అంబేడ్కర్‌ భావజాలం విరాజిల్లుతోంది. ఎందరో మహా­నుభావులు కలలుగన్న సామాజిక అసమా­నతలు తొలగించి సామాన్యుల స్థితిగతుల్లో మార్పు తెచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్‌. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో మనోధైర్యం పెరిగింది. ఏ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు ఇన్ని రాజకీయ పదవులు ద­క్కాయి? ఇంత గౌరవం వ­చ్చింది? జగన్‌ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతోంది. దేశంలో ఎక్క­డా లేని విధంగా సామాజిక సమతుల్యత ప్రజ్వరిల్లుతోంది. అందుకే జగనే మళ్లీ కావాలి.. మళ్లీ అధికారంలోకి రావాలి.  – మేరుగు నాగార్జున, రాష్ట్ర మంత్రి 

ఓటర్లకు జవాబుదారీగా ప్రభుత్వం
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఇంటి ముంగిటకు చేర్చారు సీఎం జగన్‌. దశాబ్దాలుగా గిరిజన ప్రజలు ఎరుగని సామాజిక చైతన్యం ఇప్పుడు ప్రజ్వరిల్లుతోంది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కింది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వం ఓటు వేసిన ప్రజలకు జవాబుదారీగా పని చేస్తోంది. అందుకే రాష్ట్రంలోమళ్లీ సీఎంగా జగన్‌ ఉండాలి.. పేదలకు మరింత మేలు జరగాలి.   – కె.భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే 

జగన్‌తోనే సామాజిక న్యాయం 
స్వాతంత్య్రం తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. అందరూ పేదల గురించే, సామాజిక న్యాయం గురించే మాట్లాడేవారు. కానీ తొలిసారిగా సామాజిక న్యాయం నినాదం కాదని, అది అమలు చేయాల్సిన విధానమని నిరూపించిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌. సీఎం జగన్‌ పేదవాడి గుండె చప్పుడుగా నిలబడితే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్ధంలో పేదలు గెలవాలంటే, వారి జీవితాలు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ జగనే సీఎం కావాలి.
– మోపిదేవి వెంకట రమణ, రాజ్యసభ సభ్యుడు 

నథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌
సీఎం జగన్‌ అనుకుంటే నథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌. వైనాట్‌ 175 ధీమా వెనకాల నాలుగున్నరేళ్ల ప్రభుత్వ సంక్షేమం ఉంది. నిస్వార్థంగా పేదల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే. అందుకే త్వరలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ­నిర్వ­హిస్తున్నాం. ఇది సామాజిక న్యాయ యాత్ర. పేద­వాడికి జరిగే మంచిని వివరించే యాత్ర. దాదాపు 175 నియోజకవర్గాల్లో మీటింగులు పెడతాం. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన సీనియర్‌ నాయ­కు­లు ఉంటారు. ప్రతిరోజూ అ­సెంబ్లీ నియోజకవర్గాల వా­­రీగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగులు ఉంటా­యి. రా­బో­యే కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడికి, పెత్తందా­రుకీ మధ్య జరిగే యుద్ధంలో గెలవడానికి వైఎ­స్సార్‌సీపీ కార్యకర్త, నాయకులు సన్నద్ధం కావాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ 

పేదల సంతోషం కోసమే జగన్‌
పేదలు సంతోషంగా బతకాలంటే సీఎంగా జగన్‌ ఉండాలి. పేద గడప నుంచి వచ్చిన మన పిల్లలను అంతర్జాతీయ మెట్లు ఎక్కిస్తున్నారు. అనారోగ్యం వస్తే ఇంటికే డాక్టర్‌ వస్తున్నారు. రైతన్నకు తోడుగా భరోసా ఇస్తున్నారు. వలంటీర్ల సైన్యంతో కరోనాను ఎదిరించడమే కాదు.. ప్రజా సంక్షేమాన్ని గడపగడపకు చేరుస్తున్నారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగాలన్నా, ఆంధ్ర­ప్రదేశ్‌ ప్రజలు చిరు­నవ్వుతో ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన జగన్‌ ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రజ­లకు గత మాఫియా పాలనను, ప్రస్తుత సంక్షేమ సారథ్యాన్ని వివరించాలి.  – విడదల రజిని, రాష్ట్ర మంత్రి 

ధనిక, పేదల మధ్య అంతరంపై పోరు
రాష్ట్రంలో అభివృద్ధి,  సంక్షేమం రెండూ ఉండా­లంటే 2024లోనూ మళ్లీ జగన్‌ను సీఎంగా చేసు­కోవాలి. ధనిక, పేద అనే తారతమ్యాలను తొల­గించే లక్ష్యంతో సీఎం జగన్‌ పాలన సాగి­స్తున్నారు. అందుకే ప్రతి రంగంలోనూ ఏపీ సత్తా చాటు­తోంది. చంద్రబాబు ప్రభుత్వం విద్యను నిర్వీ­ర్యం చేస్తే.. సీఎం జగన్‌ గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లిషు మీడియం, సీబీ­ఎస్‌ఈ, ఐబీ సిలబస్, డిజిటల్‌ లెర్నింగ్‌ విధా­నాలను ప్రోత్సహి­స్తున్నారు. 3257 ప్రొసీ­జర్లలో ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తున్నారు. 17 కొత్త మెడికల్‌ కాలేజీలతో పాటు ఆరోగ్య ఆసరా, ఇంటి వద్దకే వైద్యం దక్కుతోంది. ఇవన్నీ ఉండాలంటే మళ్లీ సీఎంగా జగన్‌ రావాల్సిందే. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి 

బాబును నమ్మి బాగుపడింది లేదు
చంద్రబాబు పెత్తందారులతో కలిసి పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తే.. అదే పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య, వైద్య సౌకర్యాలు అందిస్తున్న మనసున్న వ్యక్తి జగన్‌. దేశంలో చంద్రబాబును నమ్మి బాగుపడిన వాళ్లు లేరు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆనందపడని వాళ్లూ ఉండరు. రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తే.. దానిని సీఎం జగన్‌ సమర్థవంతంగా గాడిన పెట్టారు. స్కాముల్లో తన స్కిల్‌ చూపించి రూ.కోట్లు కొట్టేసిన ఘనుడు చంద్రబాబు. స్కిల్‌ కేసులో తండ్రి అడ్డంగా దొరికిపోయి జైలులో ఉంటే.. కొడుకు లోకేశ్‌ ఢిల్లీ పారిపోయి తలదాచుకుంటున్నాడు. ఇలాంటి దుష్టశక్తులు ఏం చెప్పినా మన జీవితాలతో మళ్లీ ఆటలు ఆడుకోవడానికేనని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. – నందిగం సురేష్, బాపట్ల ఎంపీ 

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం 
పేదలు గుడిసెల్లోనే ఉండాలని, కాలనీల్లో ఉండకూడదనుకునే మనస్తత్వం చంద్రబాబుది. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అవమానించారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కించపరిచిన కుసంస్కారం చంద్రబాబుది. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మేనిఫెస్టో కూడా కనపడకుండా చేశారు. కానీ, సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే   హామీలను నెరవేర్చి పేదల గుండెల్లో నిలిచిపోయారు. ఏకంగా చట్టం తెచ్చి నామినేటెడ్‌ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చారు. అందుకే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని అందరమూ ప్రజల్లోకి తీసుకెళ్దాం.– పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి 

బాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను చైతన్య పరచాలి
దేశంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనంతగా ఏపీలో సంక్షేమ ఫలాలు నిజమైన పేదలకు దక్కుతున్నాయి. గ్రాఫిక్స్‌ బొమ్మల మాయలేదు. పథకం పేరుతో దోపీడీ లేదు. స్కాంలు లేవు. అందువల్లే రాష్ట్ర పేద ప్రజలందరికీ నేరుగా రూ.2.60 లక్షల కోట్లు లబ్ధి జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలహీనులైన పేదలను బలవంతులుగా మార్చిన నాయకత్వం ఇది. మహానేత వైఎస్సార్‌ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌ ఇస్తే.. జగన్‌ ముస్లిం పిల్లలను కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే జగన్‌ ఏపీకి కావాలి. చంద్రబాబు అధికారం కోసం చెప్పే అబద్ధాలు నమ్మొద్దని ప్రజలను చైతన్యపరచాలి. – హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్యే 

సంక్షేమ పథకాల విప్లవం 
సీఎం జగన్‌ అంటేనే ఒక సంకల్పం. పేదరికాన్ని రూపుమాపడమే ఆయన లక్ష్యం. అందుకే సంక్షేమ పథకాల విప్లవాన్ని సృష్టించారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల్లోని పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పౌర సేవలను డోర్‌ డెలివరీ చేయడంతో పాటు మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను ప్రకటించారు. ఇది గతంలో ఏ పాలకుడికీ సాధ్యం కాలేదు. గత పాలకులకు భిన్నంగా చెప్పిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేశారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడని నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం మళ్లీ జగనే రావాలి.. పేదలకు మరింత న్యాయం జరగాలి.   – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మంత్రి 

మరిన్ని వార్తలు