-

కాంగ్రెస్‌కు సంబంధం లేదు

28 Nov, 2023 03:08 IST|Sakshi
మెదక్‌ జిల్లా చిన్నగొట్టిముక్కులలో ఆత్మియ సమ్మేళనంలో మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే 

రైతుబంధు నిలిపివేతపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 

సీఎం కేసీఆర్‌ తమపై నిందలు మోపడం తగదని హితవు

నర్సాపూర్‌: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్‌ నిలిపివేసిందని చెప్పారు.

కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్‌ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్‌... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.  

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. 
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్‌ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్‌ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు.

ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్‌... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్‌ఆర్, పేపర్‌లీక్‌ తదితర స్కామ్‌ల ద్వారా తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు