కేసీఆర్‌ గొంతు నొక్కుడే వారి ఎజెండా

18 Nov, 2023 04:11 IST|Sakshi

అందరూ కలిసే రాష్ట్రానికి వస్తున్నారు 

కేసీఆర్‌ సింగిల్‌గా వస్తున్నారు 

మేం మిమ్మల్నే నమ్ముకున్నాం 

మంచిర్యాల రోడ్‌ షో, జన్నారం సభలో కేటీఆర్‌ 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మోదీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే లాంటి వారెందరో తెలంగాణకు వస్తున్నా రు. వాళ్ల ఎజెండా ఒక్కటే. కేసీఆర్‌ గొంతు నొక్కాల నే. కేసీఆర్‌ మాత్రం సింగిల్‌గా వస్తున్నారు. మేంమి మ్మల్నే నమ్ముకున్నాం..’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రె సిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఇంటి పార్టీ అని, ఢిల్లీ పార్టీలు అవసరం లేదని చె ప్పారు. మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్‌ షోలో, ఖానాపూర్‌ నియోజకవర్గం జ న్నారంలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.  

ఏ పార్టీకైనా రైతుబంధు ఆలోచన వచ్చిందా? 
‘రాష్ట్రం వచ్చాక తాగు, సాగునీరు, 24 గంటల ఉచి త కరెంటు ఇస్తున్నాం. దేశంలో ఏ పార్టీకైనా రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచాం. కల్యాణలక్ష్మి, షా దీ ముబారక్‌ ఇస్తున్నాం. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటే భయపడేవారు. ఇప్పడా పరిస్థితి మారింది. 15 లక్ష ల మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చాం. సింగరేణిలో కార్మికుల వాటా పెంచాం..’అని కేటీఆర్‌ తెలిపారు. 

మోదీ పచ్చి మోసకారి: ‘బీజేపీ వాళ్లు అల్లం, బెల్లం చేస్తాం అన్నారు. పీఎం నరేంద్ర మోదీ జన్‌ధన్‌ ఖాతాల్లో పంద్రాలాఖ్‌ (రూ.15 లక్షలు) వేస్తా అన్నారు. మోదీ పచ్చి మోసకారి. మతతత్వ మంటలు పెట్టే పార్టీ బీజేపీని ఎట్టి పరిస్థితిల్లోనూ నమ్మి మోసపోవద్దు. కాంగ్రెస్‌కు ఇప్పటికే 11 సార్లు చాన్స్‌లు ఇచ్చాం. ఇంకా ఎందుకు అవకాశం ఇవ్వాలి?..’అని ప్రశ్నించారు. 

కోడళ్లకు రూ.3 వేలు ఇస్తాం: ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కోడళ్లు కొంత కోపంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిప్తే 18 ఏళ్లు నిండిన రేషన్‌ కార్డు లు ఉన్న వారందరికీ సౌభాగ్యలక్ష్మి కింద రూ.3 వేలు ఇస్తాం. అత్తలకు ఆసరా పింఛన్లు క్రమంగా రూ.5 వేలకు పెంచుతాం’ అని హామీ ఇచ్చారు. 

ఆలోచించి ఓటు వేయకపోతే ఆగమై పోతాం 
‘స్కాంలు కావాలంటే కాంగ్రెస్‌కు, స్కీంలు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలి. మంచిర్యాలలో పే కాట క్లబ్‌లు కావాలో, ఐటీ హబ్‌లు కావాలో తే ల్చుకోండి. ఆలోచించి ఓటు వేయకపోతే ఆగమైపోతాం. బోగస్‌ సర్వేలు నమ్మొద్దు. కారు గుర్తుకే ఓటెయ్యాలి..’అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, ఖానాపూర్‌ అభ్యర్థి భూక్య జాన్సన్‌ నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు