30 ఏళ్లుగా బీసీలకు టీడీపీ మోసం: మంత్రి అనిల్‌

23 Jul, 2021 14:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడువి మతిలేని మాటలు అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. 30 ఏళ్లుగా బీసీలను టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని గుర్తుచేశారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి అనిల్‌ తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. అచ్చెన్నాయుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం కౌంటర్ అటాక్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఎవరూ ఇవ్వని ప్రాధాన్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్నారన్నారని తెలిపారు. అర్ధ శాతం రాజకీయ పదవులు బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేటాయించారని వివరించారు. ఒకేసారి 1,30,000 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. సీఎం జగన్ వెంటే బీసీలు ఉండటాన్ని జీర్ణించుకోలేని అచ్చెన్నాయుడు విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.


    

మరిన్ని వార్తలు