‘రేవంత్‌..  మేము కూడా నీలా మాట్లాడగలం’

11 Nov, 2023 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్‌ మండిపడ్డారు. రేవంత్‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నోటికి వచ్చినట్లు రేవంత్‌ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది.  పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. 

హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు