ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!

28 Oct, 2022 08:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్‌హౌజ్‌ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి.

న్యాయపరమైన చిక్కులు రాకుండా..
టీఆర్‌ఎస్‌ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్‌హౌజ్‌లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్‌ భావిస్తు న్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?

నిందితులను రిమాండ్‌కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు వివరించారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్‌లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి.

ప్రగతిభవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు
ఫామ్‌హౌజ్‌ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్‌), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్‌లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్‌హౌజ్‌లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి.
చదవండి: ఫామ్‌హౌజ్‌ ఘటన.. టీఆర్‌ఎస్‌పై కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఎటాక్‌

ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్‌ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్‌లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్‌రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  

మరిన్ని వార్తలు