ఢిల్లీలో పవన్‌ పనులు హాస్యాస్పదం.. తెలుగు ప్రజల గౌరవం తాకట్టు పెట్టొదు: ఎంపీ భరత్‌

6 Apr, 2023 12:57 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌పై వైఎ‍స్సార్‌పీసీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. పవన్‌ చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఎంపీ భరత్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అజెండాను పవన్‌ మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లాడా? లేక వాళ్లే పిలిచారా అన్న విషయం తెలియాలి. ఢిల్లీ పెద్దలు పవన్‌కు అపాయింట్మెంట్‌ ఇవ్వట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొదు అంటూ హితవు పలికారు. పవన్‌ ఢిల్లీలో చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. మిత్రధర్మం పాటించని మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారు. చంద్రబాబు, పవన్‌ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదు. 

బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవడం విచిత్రంగా ఉంది. గతంలో పవన్‌.. పాచిపోయిన లడ్డులు అని చెప్పి బీజేపీ పెద్దలతో మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్లాడో చెప్పాలి. పవన్‌ రెండు కనిపిస్తే.. మళ్లీ మూడు రోజులు కనిపించడు. చంద్రబాబుపై ప్రజలకు ఏ మాత్రం నమ్మకం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమ నమ్మకం, తమ భవిష్యత్తు అని అనుకుంటున్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నాము. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే. చంద్రబాబు హయాంలో  ఏ రకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కూడా అమలు జరగలేదు. 2024లో కూడా సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్ర ముఖచిత్రం కూడా మారుతుంది’ అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు