బాబు అను‘కుల’ మీడియా చౌకబారు కుతంత్రాలు

17 Jun, 2021 14:23 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుకూల మీడియాపై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దుమ్మెత్తిపోశారు. ‘‘ఒక దురుద్దేశ భావనను నిజం అని చూపించడానికి బాబు అను‘కుల’ మీడియా చేస్తున్న కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా ఉంటున్నాయని’’ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో సీఎం జగన్ గారు చేసిన అభ్యర్థనలను కేంద్రం తిరస్కరిస్తే బాగుండనే దుర్మార్గపు ఆలోచనలను ఏమనాలి అంటూ ఆయన ప్రశ్నించారు. అలా అనుకోవడం ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవడమేనని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

పంచ గ్రామాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం..
సింహాచల ఆలయ భూముల పరిధిలోని పంచ గ్రామాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కాబోతోందని ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు. ‘‘ఆ గ్రామాల్లో ఉన్న 12 వేల ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  సంకల్పించారు. చంద్రబాబు వల్ల కానిది సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని’’ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
 

చదవండి: అశోక్‌గజపతిరాజు ఒక దొంగ: విజయసాయిరెడ్డి
తగ్గిందని అలసత్వం వద్దు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు