కొల్లు రవీంద్రకు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

1 Dec, 2023 19:31 IST|Sakshi

సాక్షి, కృష్ణా: టీడీపీ నేత కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలని సూచించారు. బందరు అభివృద్ధి రవీంద్ర చేసిందేమిటో తాను చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్‌ విసిరారు. 

కాగా, పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడమనే ఒక శాపం ఇచ్చాడు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు. మదర్సా స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు. మీ హయాంలో పోర్ట్ కట్టకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్. పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు. 

పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్‌ కాలేజ్‌ నీ హయంలో అంటున్నావ్‌. ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్‌. నువ్వు కనీసం ఒక్క జీవో అయినా ఇచ్చావా?. ఇస్తే చూపించు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పేర్ని నాని చలవే. ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్‌ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు. 

ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం. కానీ, నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి. నేను నా కొడుకుని క్రొత్తగా ప్రమోట్ చేసుకోవడం ఏంటి?.  గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు