Memes On Exit Poll Results: రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్‌

1 Dec, 2023 18:16 IST|Sakshi

కావేవీ మీమ్స్‌కు అనర్హం అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గురువారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌పైనా సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తాయి. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం పూర్తయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు సంబంధించి వివిధ  సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. 

ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, రెండు చోట్ల బీజేపీ, ఒక రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ వస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరవలో ఉన్నట్లు కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఆయా పార్టీలు పోటీ పడే క్రమంలో రిసార్టు రాజకీయాలు మొదలవుతాయని భావిస్తున్నారు. దీంతో రిసార్ట్‌లకు డిమాండ్‌ వస్తుందని, సొమ్ము చేసుకునేందుకు రిసార్ట్‌ ఓనర్లకు మంచి అవకాశం వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరగనుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది ఆరోజే తేలనుంది.

మరిన్ని వార్తలు