రేవంత్‌కు శాపనార్థాలు.. గాంధీభవన్‌లో నిరసనలు

15 Oct, 2023 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మైనార్టీ నేతలు నిరసనకు దిగారు. బహుదూర్‌పురాలో ఖిలీమ్‌ బాబా, చాంద్రాయణగుట్టలో షకీల్‌ దయానికి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించలేదని నిరసస వ్యక్తం చేస్తూ.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాతబస్తీకి చెందిన టికెట్లు.. సంబంధం లేని వారికి ఇచ్చారని మైనార్టీ  నేతలు ఆందోళనకు దిగారు.

మరో వైపు, టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించడానికి రేవంత్‌ వచ్చాడంటూ, ఉప్పల్‌ టికెట్‌ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వచ్చే లిస్ట్‌ సంబంధించిన వాళ్లది కూడా శాపనార్థాలు తగులుతాయంటూ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.. డబ్బులు ఇవ్వనందుకే ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని కాల్చివేశారు.

కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.
చదవండి: 51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్‌ వ్యూహమేంటి? 

మరిన్ని వార్తలు