తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

17 Nov, 2023 20:43 IST|Sakshi

Telangana Assembly Elections Updates

కుత్బుల్లాపూర్‌ విజయభేరిలో రేవంత్‌రెడ్డి కామెంట్స్‌

 • నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలది
 • నేను ఈ స్థాయికి చేరడంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ దాగుంది
 • కాంగ్రెస్‌ను గెలిపించేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా
 • కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తుండు..
 • తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా,కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్ 
 • సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది
 • కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే
 • చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందే
 • హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్

జూబ్లీహిల్స్ రోడ్ షో  లో కేటీఆర్

 • విరాట్  కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలి
 • అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి కానీ ఓటు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి
 • అజారుద్దీన్‌కు ఏ గల్లీ తెలియదు, జూబ్లీహిల్స్లో ఏ మనిషి తెలియడు
 • కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు
 • కాంగ్రెస్ లో 11 మంది సీఎంలు రెడీ గా ఉన్నరు
 • కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం
 • కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెట్రో రైలు పూర్తి చేయలేక పోయింది
 • హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కల్లుండి చూడలేక పోతున్నారు
 • అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు
 • యూపీ లో చెల్లని అజారుద్దీన్  తెలంగాణ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు?
 • అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3000 పెన్షన్ ఇస్తాం
 • వరల్డ్‌కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణ ఎన్నికల్లో కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా.

కుత్బుల్లాపూర్‌ విజయభేరి సభలో ఖర్గే కామెంట్స్‌ 

 • తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ అంతా ఒక్కటే
 • ప్రధాని మోదీ,కేసీఆర్ దేశాన్ని ,రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
 • కాంగ్రెస్ పార్టీ తోనే పేదల బతుకులు మారుతాయి
 • ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ ప్రజల ఆశ  తీర్చింది సోనియా గాంధీనే
 • మోదీ,కేసీఆర్ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నారు
 • కానీ వారు ఏమీ చేయలేరు

కుత్బుల్లాపూర్‌ విజయభేరి సభకు ఖర్గే 

 • కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే.
 • భారీగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు

టూరిజం కార్పొరేషన్‌ ఎండీ సస్పెన్షన్‌

 • తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావును సస్పెండ్‌ చేసిన ఈసీ
 • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెంట తిరుమలకు వెళ్లడంపై ఈసీ ఆగ్రహం 

వరంగల్‌ కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ గాంధీ కామెంట్స్‌

 • సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసమే
 • తెలంగాణ సపంద ఒక కల్వకుంట్ల కుటుంబానికే చేరింది
 • కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్‌ ఇంట్లో వేసుకున్నారు
 • అవినీతికి పరాకాష్ట కెసిఆర్
 • దళితబంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు
 • తెలంగాణలో 20 లక్షలు కుటుంబాల భూమిని గుంజుకున్నారు
 • కేసీఆర్‌ చదువుకున్న కళాశాల కట్టించింది కాంగ్రెస్ పార్టీయే
 • ఐటీ క్యాపిటల్‌ నిర్మించింది కాంగ్రెస్
 • మా సర్కారు వస్తే గ్యాస్‌ సిలిండర్‌ కేవలం 500 రూపాయలే
 • తెలంగాణ మహిళలు బస్‌లో తిరిగితే ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు
 • ప్రతి నెలా మహిళల బ్యాంకు ఖాతాలో 2500 రూపాయిలు వేస్తాం 
 • రైతులకు ఉచిత విద్యుత్
 • కుల గణన చేస్తాం
 • మా ఉద్యమం బీజేపీ,టీఆర్‌ఎస్‌పైనే 
 • మోదీ ఇక తెలంగాణలో కనిపించరు

కాంగ్రెస్‌లోకి విజయశాంతి 

 • కాంగ్రెస్‌లో చేరిన  విజయశాంతి 
 • కండువా కప్పి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే 
 • ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన రాములమ్మ

పచ్చమీడియాలో రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూలు

 • అనుకోకుండా నిజాలు బయటపెట్టేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
 • మీరు ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టరు కదా అన్న ప్రశ్నకు సూటి సమాధానాలు
 • అవినీతి ఉందని ఆరోపించాం, అక్రమాలు జరిగాయని చెప్పాం
 • కేసీఆర్‌ కుటుంబం మీద కేసులు పెడతామన్న రేవంత్‌
 • చంద్రబాబు అరెస్ట్‌ కావడం మీకు కలిసొచ్చింది కదా అన్న ప్రశ్నకు అవునన్న రేవంత్‌
 • చంద్రబాబుతో తనకు చాలా రోజులుగా మంచి సాన్నిహిత్యం ఉందన్న రేవంత్‌
 • చంద్రబాబు జైలుకు వెళ్లిన రోజు పర్సనల్‌గా చాలా బాధకు గురయ్యానన్న రేవంత్‌
 • చంద్రబాబు అరెస్ట్‌ ఓట్ల పరంగా కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందన్న రేవంత్‌
 • చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ అంశం సున్నితంగా మారిందన్న రేవంత్‌
 • ఏపీలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా పోటీలో ఉన్నాడు
 • తెలంగాణలో పవన్‌కళ్యాణ్‌కు తక్కువ ఓట్లు వస్తే..
 • దాని ప్రభావం ఏపీలో ఆ కూటమిపై పడుతుందన్న రేవంత్‌

హుజురాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో  కేసీఆర్‌ కామెంట్స్‌

 • మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుంది
 • అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ విధివిధానాలు గమనించాలి
 • ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు 
 • ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దు 
 • బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం : కేసీఆర్‌ 
 • రైతుబంధు రూ.16 వేలు ఇస్తాం 
 • మూడు గంటల కరెంట్‌తో పొలం పారుతుందా 
 • ఉన్న కరెంట్‌ను ఊడగొట్టిందే కాంగ్రెస్‌
 • తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టింది 
 • బీఆర్‌ఎస్‌ను చీల్చాలని ప్రయత్నించింది

అమిత్‌ షా టూర్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు 

 • ఈరోజు రాత్రి హైదరాబాద్‌ రావాల్సిన అమిత్‌ షా రేపు మధ్యాహ్నం రానున్నారు
 • 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
 • 12.50కి గద్వాల సభలో పాల్గొంటారు
 • సాయంత్రం 6.10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ షా

వికారాబాద్‌ బొంరాసిపేటలో రేవంత్‌రెడ్డి కామెంట్స్‌

 • బీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
 • ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు,భూములకు పట్టాల పంపిణీ జరిగింది
 • మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందింది
 • వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామన్న బీఆరెస్ హామీ నెరవేరలేదు
 • కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారు
 • ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది నేను
 • పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదు
 • ఓటుకు పదివేలు ఇచ్చి బీఆరెస్ గెలవాలనుకుంటోంది
 • మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు
 • బంగారు తెలంగాణ సంగతేమో కానీ.. భార్య మెడలో బంగారం అమ్మే పరిస్థితి తెలంగాణలో దాపురించింది. 
 • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం.

వరంగల్‌లో రాహుల్‌ గాంధీ పాదయాత్ర

 • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌లో పాదయాత్ర చేస్తున్నారు

 మేనిఫెస్టో రిలీజ్‌ సందర్భంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే కామెంట్స్‌

 • తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో
 •  ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
 • కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది
 •  కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది 
 •  ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది
 •  మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
 •  జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు
 •  ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతరు
 •  జనాలు బై బై కేసీఆర్ టాటా కేసీఆర్ అంటరు
 •  విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు
 •  జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు

కరీంనగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ కామెంట్స్‌..

 • ఓటు వేసేటపుడు ఆలోచించి ఓటు వేయాలి 
 • ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దు 
 • తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రె​స్‌ ఆగం చేసింది 
 • కాంగ్రెస్‌ చరిత్ర గురించి  కూడా  ప్రజలు ఆలోచించాలి
 • మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ అంటోంది
 • తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంపద పెంచుతున్నాం
 • మూడు  గంటల కరెంట్‌తో పొలం పారుతుందా 
 • ఉన్న కరెంట్‌ని ఊడగొట్టింది  కాంగ్రె‍స్సే
 • కంటి వెలుగు వంటి ఎన్నో కొత్త స్కీమ్‌లు తీసుకువచ్చా ‍
 • కరీంనగర్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాం  
 • మళ్లీ  బీఆర్‌ఎస్‌దే అధికారం
 • ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు 
 • కరీంనగర్‌ అప్పుడెలా ఉందో ఇప్పుడెలా ఉందో ఆలోచించాలి 
 • ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే

తెలంగాణలోనూ కులగణనను జరిపిస్తాం: రాహుల్‌

►పినపాకలో రాహుల్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం
►పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చింది.
►ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్‌ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తాం.
►కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో నేనే స్వయంగా వెళ్లి చూశా.
►కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారు.
►తెలంగాణలో 24 గంటల కరెంట్‌ కేవలం కేసీఆర్‌ ఇంట్లో మాత్రమే వస్తుంది.
► కేసీఆర్‌ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారు.

మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..
►ప్రతీ ఏటా రైతు భరోసా
►రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానిక రూ.15వేలు
►వ్యవసాయ కూలీలకు రూ.12వేలు
►వరి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌. 
►ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. 
►ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5లక్షలు 
►ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. 
►విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు. 
►ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌. 
►చేయూత పెన్షన్‌ రూ.4వేలు
►మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500
►రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
►నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడి యాక్ట్‌.
►ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
►ధరణి పోర్టల్‌ రద్దు.
►దివ్యాంగులకు ఆరువేల పెన్షన్‌. 
►కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్డీతో విచారణ
►మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు. 
►తొలి కేబినెట్‌లో మెగా డీఎస్సీ
►విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్‌
►ఖమ్మం, ఆదిలాబాద్‌ నూతన విశ్వవిద్యాలయాలు
►ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
►కొత్త రేషన్‌ కార్డులు జారీ. 
►ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం
►రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి. 
►గ్రూప్‌-3కి జూన్‌ 1, 2024
►పోటీ పరీక్షలకు ఫీజు రద్దు.
►గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు జాబ్‌ క్యాలెండర్‌
►సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్‌

పూర్తి మేనిఫెస్టో కోసం క్లిక్‌ చేయండి

మాది పీపుల్స్‌ మేనిఫెస్టో: భట్టి విక్రమార్క
►భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర సంపదను పేదలకు పంచే విధొంగా మేనిఫెస్టో. కౌలు రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా మేనిఫెస్టో. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయి. ఇది పీపుల్స్‌ మేనిఫెస్టో. ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. 

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు అవసరమైన అన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టాం.
►ఈ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌కు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌.
►సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం
►అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం.
►కేసీఆర్‌కు పదేళ్లు అధికారం ఇచ్చినా, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు.
►నిరుద్యోగ సమస్యలను బీఆర్‌ఎస్‌ పరిష్కరించలేదు. 
►కేసీఆర్  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు.
►పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు..
►నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు.
►పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు
►వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.
►ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు.
►తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది
►మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు.
►కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు..
►కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు.
►ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల
►గాంధీభవన్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేసింది. 
►మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విడుదల చేశారు. 
►టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో ‘అభయ హస్తం’ పేరిట 42 పేజీలతో ఉంది. 
►62 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
►ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,  సీఏల్పీ నేత భట్టి‌‌,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో బండి సంజయ్‌ ప్రచారం..
►చామనపల్లిలో సంజయ్‌ ఎన్నికల ప్రచారం
►బండి సంజయ్‌ కామెంట్స్‌..
►నేను అవినీతికి పాల్పడితే నన్ను స్టార్ క్యాంపెయినర్ ఎందుకు చేస్తారు? 
►జాతీయ కార్యదర్శి ఎందుకు చేస్తారు? 
►కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎందుకు బరిలో దింపారో గంగుల చెప్పాలి.
►భూకబ్జాలు, కమీషన్లు, గంజాయి వంటి అక్రమదందాలకు కేరాఫైన గంగుల నాపై ఆరోపణలా?
►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నది ఓ ముసుగు మాత్రమే.
►ఆర్టీసీ ఆస్తులు కొట్టేసిందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తోంది.
►ఎంఐఎం వాళ్లను రేప్పొద్దున కరీంనగర్ కార్పోరేషన్‌లో మేయర్ చేస్తానని గంగుల ఒప్పందం కుదుర్చుకున్నారు.
►బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా.. అలాగే కరీంనగర్‌లోనూ అనూహ్య స్పందన లభిస్తోంది.

రాహుల్‌ గాంధీ కాదు.. రాంగ్‌ గాంధీ: మంత్రి హరీష్‌
►రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారు
►కర్ణాటకలో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు
►కర్ణాటకలో ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదు
►కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారు
►ఐదు గ్యారంటీలని చెప్పిన కాంగ్రెస్ ప్రజలకు రాం రాం చెప్పారు
►ఆ గ్యారంటీలకు దిక్కులేదు
►విద్యార్థుల స్కాలర్ షిప్‌లు ఇవ్వటం లేదు
►స్కాలర్ షిప్‌లు ఇవ్వకుండా కోత పెట్టి కార్మికుల పిల్లలను చదువుకు దూరం చేస్తోంది
►తెలంగాణలో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంది
►కర్ణాటక ప్రజా ప్రతినిధులో అసహనం వ్యక్తం అవుతోంది
►అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి నేతలు అడుగుతున్నారు
►వెలుగుల దీపావళి కావాలా?, కర్ణాటక లాంటి దివాలా కావాలా? 
►తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి
►357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
►కానీ, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
►మేము రైతులం అని చెప్పుకోవడానికి తెలంగాణలో రైతులు గర్వంగా చెప్పుకుంటున్నారు
►గెలిచే దాకా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు, ఆ తర్వాత excuse me please అంటారు
►ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
►కర్ణాటక పరిస్థితి తెలంగాణకు కావాలా?
►ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి
►రాహుల్ గాంధీ రాంగ్ గాంధీగా మారాడు
►కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్‌ను రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు
►కర్ణాటక ప్రజల్లగా తెలంగాణ ప్రజలు మోసపోరు.

►చిదంబరం మరోసారి తెలంగాణ ప్రజల మనుసు గాయం చేసేలా మాట్లాడారు
►అమరవీరుల త్యాగాలను కించపరిచేలా చిదంబరం వాఖ్యలు ఉన్నాయి
►కాంగ్రెస్ నాయకులను ప్రజా క్షేత్రంలో నిల్చోబెట్టి అమరుల తల్లులతో కొరడాతో కొట్టించిన తప్పు లేదు
►బేషరతుగా చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
►చిదంబరం తీరు ఎలా ఉందంటే..
►హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారీ చెప్పినట్టు ఉంది.
►స్వాతంత్రం పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్ సారీ చెప్పినట్టు ఉంది.
►ఆత్మబలి దానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా మీ పాపం పోదు.

బీఆర్‌ఎస్‌లోకి కత్తి కార్తీక..
►కత్తి కార్తీక అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. 
►తెలంగాణభవన్‌లో మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో ఆమె గులాబీ పార్టీలో చేరిక
►పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్‌. 
►కత్తి కార్తిక కామెంట్స్‌..
►నాకు రోషం, కసి ఎక్కువ. 
►దుబ్బాకలో కాంగ్రెస్‌ లేదు. 
►అలాంటి దుబ్బాకలో కాంగ్రెస్‌ జెండా మోసి పార్టీని కాపాడాను. 
►కాంగ్రెస్‌కు పట్టిన శని రేవంత్‌ రెడ్డి. 
►ఆడపిల్ల ఉసురు రేవంత్‌కు కచ్చితంగా తాకుతుంది. 
►ఆడబిడ్డను కంటతడి పెట్టేలా చేశాడు రేవంత్‌. 
►గౌరవంలేని చోట నేను ఉండలేను. 
►అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాను. 

కాంగ్రెస్‌కు కవిత కౌంటర్‌..
►గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!!
►ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? 
►పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!
►ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ చెప్పకపోవడం దారుణం.
►ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం.
►సోనియా, రాహుల్‌ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మేకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన మంత్రి సత్యవతి రాథోడ్‌..
►మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు.
►గూడూరు మండలంలోని  కొంగర గిద్దె గ్రామంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్ నాయక్‌తో కలిసి ప్రచారం.
►మహిళలు మంగళ హారతి పట్టగా హారతిలో డబ్బులు పెట్టిన మంత్రి
►వీడియో ఫుటేజ్ ఆధారంగా విచారణ చేసిన ఎన్నికల అధికారులు.
►మంత్రిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద 171-E, 171-H ఐపీసీ r/w188 iocసెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన గూడూరు పోలీసులు

తెలంగాణ ఎలక్షన్‌ కమిషన్‌కు ఈసీఐ కీలక సూచనలు
►రాష్ట్రంలో పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై ఎస్‌ఈసీకి పలు సూచనలు చేసిన ఈసీ
►నామినేషన్ల ఘట్టంలో ఆర్వో పనితీరుపై అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదు. 
►మొదటి నుంచి తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన ఈసీ. 
►ఈసీఐకి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీసిన సీఈసీ. 
►తెలంగాణలో పలుచోట్ల జరిగిన ఘటనలపై ప్రస్తావించిన ఎలక్షన్‌ కమిషన్‌
►చివరి రెండు రోజులు డబ్బు, మద్యంపై ఫోకస్‌ పెట్టాలి: ECI
►వచ్చే వారంలో తెలంగాణకు మరిన్ని కేంద్ర బలగాలు. 
►నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. 
►ఎస్పీలు పనితీరు స్పీడప్‌ చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చిన ఈసీఐ. 

రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టులు..
►నేడు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ తెలంగాణకు రానున్నారు. 
►తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు స్వాగతమంటూ పోస్టర్లు, బాన్యర్లు.
►శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో వెలసిన బ్యానర్లు. 
►బ్యానర్లలో తెలంగాణ అమరుల ఫొటోలు మధ్యలో రాహుల్‌ ఫొటో. 

ఈనెల 18న బీజేపీ మేనిఫెస్టో..
►తెలంగాణకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఈనెల 18న విడుదల
►మేనిఫెస్టోను విడుదల చేయనున్న అమిత్‌ షా. 
►ప్రధాని మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో. 
►ఒక్క ఓటు రెండు పెన్షన్లూ అంటూ ప్రచారం చేయాలని నిర్ణయం 
►మరోవైపు, ఈనెల 19న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. 
►తెలంగాణలో మూడు సభల్లో ప్రసంగించనున్న జేపీ నడ్డా. 
►చేవెళ్ల, నారాయణపేట్‌లో బహరంగ సభలకు నడ్డా హాజరు. 

నేడు తెలంగాణకు రాహుల్‌, ఖర్గే
►నేడు తెలంగాణకు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. 
►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వీరు పాల్గొననున్నారు. 
►నేడు 12 గంటలకు మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొననున్న ఖర్గే. 
►ఈరోజు మూడు నియోజకవర్గాల్లో రాహుల్‌ గాంధీ పర్యటన
►పినపాక, నర్సంపేట, వరంగల్‌ ఈస్ట్‌లో రాహుల్‌ పర్యటన. 

నేడు కరీంనగర్‌లో కేసీఆర్‌ పర్యటన
►ఈరోజు కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలు.
►సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌.
►మధ్యాహ్నం 1.30 గంటలకు కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో సభ
►మధ్యాహ్నం 2.30 గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం పత్తికుంటపల్లిలో సభ
►సాయంత్రం 4 గంటలకు జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభలకు హాజరుకానున్న కేసీఆర్.

మరిన్ని వార్తలు