Punjab Assembly Elections 2022: ఎన్నికల వేళ.. కేజ్రీవాల్‌, చన్నీలపై కేసు నమోదు

19 Feb, 2022 18:34 IST|Sakshi

ఛండీఘడ్‌: మరికొన్ని గంటల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్‌, ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. 

అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్‌ ఎన్నికల పోలింగ్‌ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే దూషించినట్లు ఒక వీడియో సోషల్‌ మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్‌ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు‌ సమాచారం.

మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా, ప్రచార సమయం ముగిసినప్పటికీ  సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు