వీడియో: ఎన్నికల సిత్రం: ‘‘కాళ్లు పట్టుకుంటా.. నాకు మద్దతివ్వు’’

3 Nov, 2023 07:48 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ముసలం వైపు దారి తీస్తోంది. గతంలో సచిన్‌ పైలట్‌ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పుడు.. ఆయన వెంట ఉన్న రెబల్స్‌లో కొందరికి ఈదఫా టికెట్లు నిరాకరించింది కాంగ్రెస్‌ అధిష్టానం. దీంతో వాళ్ల అనుచరులు ఆందోళనలకు దిగారు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు.. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు పట్టుకోబోయారు.

రాజ్‌గఢ్‌-లక్ష్మణ్‌గఢ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోహారీలాల్‌ మీనాను కాదని.. తాజాగా రిటైర్డ్‌ అయిన ప్రభుత్వ అధికారి మంగీలాల్‌ మీనాకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. దాంతో.. ఇదే స్థానం నుంచి టికెట్‌ ఆశించిన రాహుల్‌ మీనా భంగపడ్డారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాహుల్‌.. తాజాగా మూడో జాబితా ప్రకటన తర్వాత రాజస్థాన్‌కు తిరిగొచ్చారు. రాజ్‌గఢ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమై.. తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఆ సమావేశం కొనసాగుతుండగానే అక్కడికి వచ్చిన మంగీలాల్‌ తనకు అండగా నిలవాలని మోకాళ్లపై కూర్చొని రాహుల్‌ను వేడుకున్నారు. ఒక సోదరుడిలా భావించి తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన కాళ్లు పట్టుకోబోయారు కూడా. రాహుల్‌ ఒకింత ఇబ్బందికి గురై.. పాదాలను తాకకుండా మంగీలాల్‌ను ఆపారు.

మరిన్ని వార్తలు