కమలంలో కొత్త లొల్లి 

11 Nov, 2023 05:32 IST|Sakshi

నామినేషన్ల చివరిరోజు కొందరు అభ్యర్థుల మార్పు 

అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ నేతలు 

జాబితాలో ప్రకటించినా బీఫాం లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం  

ఆత్మహత్య చేసుకుంటానంటూ కిషన్‌రెడ్డికి దేశ్‌పాండే ఫోన్‌! 

సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్లు దక్కని వారితో పాటు జాబితాలో ప్రకటించినా బీఫామ్స్‌ దక్కని వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో సమస్య మరింత ముదిరింది. వేములవాడలో తుల ఉమకు బదులు వికాస్‌రావుకు, సంగారెడ్డిలో రాజేశ్వర్‌ దేశ్‌పాండేకు బదులు పులిమామిడి రాజుకు బీఫామ్‌లు ఇవ్వడంతో తుల ఉమ, దేశ్‌పాండే కన్నీటి పర్యంతం అయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించడంతో పార్టీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

చివరి క్షణంలో పలువురికి చెయ్యి
బీసీ మహిళ (కురుమ) ఉమకు టికెట్‌ కోసం ఈటల రాజేందర్‌ గట్టిగా పట్టుబట్టారు. ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అల్టిమేటమ్‌ కూడా ఇచ్చారు. దీంతో నాయకత్వం దిగివచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు బీఫామ్‌ ఇవ్వలేదు. సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటల కోరారు. దీంతో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించిందని, గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటల మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది.

కాగా తనను నామినేషన్‌ వేసుకోమని చెప్పి బీఫామ్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్‌పాండే.. కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఏమాజీ పేరుంటే శ్రీదేవిని, ఆలంపూర్‌లో మారెమ్మ ప్లేస్‌లో రాజగోపాల్‌ను బీజేపీ ఖరారు చేయడం కూడా వివాదానికి తెరతీసింది. 

అనూహ్యంగా కంటోన్మెంట్‌ సీటు... 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను చివరి నిమిషం వరకు కాంగ్రెస్‌లోనే ఉండి ఇంకా బీజేపీలో చేరని సాయి గణే‹Ùకు కేటాయించడంపై కూడా పారీ్టవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక్కడ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు నామినేషన్‌ వేసేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బీజేపీ.. ఆయనకు మొండిచేయి చూపి సాయి గణే‹Ùకు టికెట్‌ కేటాయించడం పారీ్టలో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా తుది జాబితాలో పోటీకి సుముఖంగా లేని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావుకు మల్కాజిగిరి సీటును కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మల్కాజిగిరి టికెట్‌ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నాయకత్వం మధ్యే మార్గంగా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. దీంతో భానుప్రకాష్‌ పారీ్టకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్‌ యాదవ్‌కు కేటాయించడంతో గత కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఈ సీటును గట్టిగా కోరుకున్న గజ్జెల యోగానంద్‌ ఎలాంటి కార్యచరణకు దిగుతారనేదది చర్చనీయాంశమైంది. 

బీసీలకు 36 సీట్లు 
బీజేపీ ప్రకటించిన మొత్తం 111 సీట్లలో (జనసేనకు 8 సీట్లు) బీసీలు–36, ఓసీ–44 (రెడ్డి–29, వెలమ–8, కమ్మ–3, బ్రాహ్మణ–2, వైశ్య–1, నార్త్‌ ఇండియన్‌అగర్వాల్‌–1) ఎస్సీ 19+2 (రిజర్వ్‌డ్‌తో పాటు అదనంగా 2 జనరల్‌ సీట్లు (నాంపల్లి, చాంద్రాయణగుట్ట), ఎస్టీలకు 10 కేటాయించారు. బీసీలకు ఇతర పారీ్టల కంటే అధిక సీట్లనే కేటాయించినా.. 40కి పైగా సీట్లు కేటాయిస్తామనే హామీని నేతలు నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా మాదిగలకు ఎక్కువ ప్రాధా న్యం దక్కింది. 21 స్థానాలను ఎస్సీలకు కేటాయించగా, అందులో మాదిగ సామాజిక వర్గానికి 14, మాల సామాజిక వర్గానికి 7 ఇచ్చారు. బీసీలకు కేటాయించిన 36 సీట్లలో ముదిరాజ్‌ 9, మున్నూరు కాపు 7, యాదవ 5, గౌడ 5, పెరిక 2 లోధ్‌ 2 పద్మశాలి, ఆరే కటిక, లింగాయత్, వాలీ్మకి బోయ, ఆరే క్షత్రియ, విశ్వకర్మలకు ఒక్కో సీటు కేటాయించారు. 

మరిన్ని వార్తలు