‘టీడీపీ నిజ నిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. సిద్ధమేనా’

31 Jul, 2021 13:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ‘దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు.. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది’ అని పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మరోసారి దళిత ద్రోహి అని నిరూపించుకున్నారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్లారు. దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర కూడా ఉంది’’ అని ఆరోపించారు. 

మరో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘దేవినేని అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపల్లి వచ్చారు. 2004లో వసంత నాగేశ్వరరావు కారును దగ్ధం చేసింది గుర్తులేదా. 2016 డిసెంబర్ 4న 143 సర్వే నంబర్‌లో దేవినేని మైనింగ్ ప్రారంభించారు.. అవి అసలు రెవిన్యూ భూములా.. ఫారెస్ట్ భూములా అనే విషయం తేల్చాలి. 2018లో దేవినేని ఉమా క్రషర్ ప్రారంభించారో లేదో చెప్పాలి. దేవినేని ఉమ తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు తెలుసు. దేవినేని నీచ పనులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అబద్ధాలను నిజం చేసేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దేవినేని ఉమను సమర్ధిస్తున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

మరో ఎమ్మెల్యే జోగి రమేష్‌ ‘‘చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదు. దళితులపై దాడి చేసిన దేవినేని ఇంటికి చంద్రబాబు ఎలా వెళ్తారు. చంద్రబాబుకు కొంచెం కూడా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీతో పాటు మేమూ వస్తాం.. మీరు సిద్ధమేనా. మైనింగ్‌లో దోచుకుంది ఎవరో మొత్తం తేలుస్తాం’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు. ఎన్నికల్లో ఓడించారనే కక్షతోనే దళితులపై దాడులు చేస్తున్నారు. దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడమేంటి’’ అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు